VIZAGVISION:Gouri Lankesh Protest againest Murder with Candles Pradeshana RK Beach,Visakhapatnam..జర్నలిజంలో మరో రక్తచరిత్ర ఇది. సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ దారుణహత్య ఘటనతో భారతీయ పాత్రికేయుల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గౌరి లంకేష్ హత్య ఘటనను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.జర్నలిస్టుల గొంతును నొక్కితే సహించేది లేదని, తామంతా గౌరి లంకేష్లమేనని ఈ సందర్భంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు.జర్నలిస్టును దారుణంగా హత్య చేయడమంటే, అది మీడియా స్వేచ్ఛ మీదే దాడి అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సిరీయస్గా తీసుకుని, వెంటనే దోషులను శిక్షించాలని, హత్యపై న్యాయ విచారణ కూడా చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.