వేములవాడ:* ఖాకీ వెనుక కన్న తల్లి ప్రేమ కూడ దాగుంటుందని చాటారు వేములవాడ సి.ఐ మాదవి, వేములవాడ దేవస్థానం మెట్ల దగ్గర యెవరో 20 రోజుల పసికందును వదిలి వెల్లారు.
స్థానికులు పోలీస్ వారికి సమాచారం అందించడంతో సి.ఐ మాదవి హుటాహుటిన అక్కడికి చేరుకుని పసిగుడ్డు పరిస్థితిని చూసి చలించి పోయారు వెంటనే బాబును అక్కున చేర్చుకున్నారు.
బాబును ఆసుపత్రికి తరలించి ప్రాఘదమిక చికిత్స చేయించారు, తానే స్వయంగా బాబుకు కన్న తల్లి మాదిరిగా స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి పాలు పట్టించారు ICDS అధికారులకు బాబును అప్పగించడానికి వారికి సమాచారం అందజేశారు.
అక్కడున్న కొందరు సి.ఐ మాదవిని మా జిల్లాకి పోలీసు అమ్మగా పేర్కొనడంతో అక్కడున్న వారందరి కళ్లు ఒక్క సారీగా చెమర్చాయి.
సి.ఐ మాదవి ఈ ఒక్క సంఘటనే కాకుండా ఇంతకు మునుపు కూడా ఇటువంటి ఎన్నో ఘటనలకు అమ్మవలే స్పందించి తన మంచి తనాన్ని చాటుకున్నారు, పలువురు ఆమెను అభినందించారు.