సంఘటనలు
- 1686: బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆదిల్షాహీ వంశ పతనం.
జననాలు
- 1885: గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమసిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు
- 1892: తల్లావఝుల శివశంకరస్వామి రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
- 1920: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005)
- 1925: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)
- 1952: అల్లాబక్షి బేగ్ షేక్, రచయిత మరియు నటుడు.
మరణాలు
- 2009: నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు.
- 2009: రాజ్సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు.
- 2010: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973)
పండుగలు మరియు జాతీయ దినాలు
2008 సెప్టెంబర్ 12 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించారు. 1978 సెప్టెంబర్ 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు..