సెప్టెంబర్ 12 2017 మంగళవారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు పుష్కర రాజైన గురువు చిత్ర నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోనికి ప్రవేశించుటచే కావేరి నదికి పుష్కరాలు ప్రారంభమై 12 రోజులు ఉండును. ఈ తులా రాశిలో గురువు 395 రోజుల పాటు సంచారం చేసి 2018 అక్టోబర్ 11 తర్వాత రాశిలోకి వెళ్ళును. కనుక ఖగోళంలో ఈ 385 రోజుల పాటు ద్వాదశ రాశులకు గోచారంలో మూర్తి స్వరూపంతో ఎలాంటి ఫలితాలు అందించునో దానికి తగినట్లుగా ఏయే తేదీలలో 27 నక్షత్రాల వారు ఏయే అంశాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే అంశాలను తెలియచేస్తూ ఇంతవరకు వీడియోలను ఇవ్వటం జరిగింది. ఇక మేషం నుంచి సింహం వరకు 5 రాశులకు పరిహార వీడియోలను ఇవ్వటం జరిగింది. కన్య నుంచి మీనం వరకు మరో 7 రాశులకు పరిహార వీడియోలను మరో 48 గంటలలో pranati television అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టింగ్ చేయటం జరుగును. కనుక వీక్షించగలరు. – దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ