Latest News
- Vizag vision:ఆరోగ్య బీమా భవిష్యత్తును అందించు అల్టిమేట్ కేర్ ఆవిష్కరణ భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆరోగ్య పరిరక్షణలో ఒక నూతన బెంచ్‌మార్క్ సాధనకు అద్భుతమైన ఆరోగ్య బీమా అల్టిమేట్ కేర్‌ను ఆవిష్కరించినట్లు నేడు ప్రకటించారు. మన అనుకోని వైద్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించుటకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్‌లను అందించుటకు అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉన్న పాలసీ అల్టిమేట్ కేర్ ఆరోగ్య బీమా పథకం. పాలసీదారు కోసం ఎన్నో విలువైన అంశాలను జోడించిన ఆరోగ్య పథకం. పాలసీదారులు ఈ బీమా పథకం ద్వారా మనీబ్యాక్, లాయల్టీ బూస్ట్, వెల్నెస్ డిస్కౌంట్, ఇన్ఫినిటీ బోనస్ ఇంకా అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. విస్తృతమైన ఆరోగ్య కవరేజీని అందించటమే కాక , మనీబ్యాక్ ఫీచర్ కలిగిన పాలసీ అల్టిమేట్ కేర్ ఇది పాలసీదారులు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్ అందిస్తుంది. ప్రతి 5 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత కంపెనీ మొదటి సంవత్సరపు బేస్ ప్రీమియంను వాపసు చేస్తుంది. ఇది లాయల్టీ బూస్ట్ 7 క్లెయిమ్ ఉచిత సంవత్సరాల తర్వాత మొదటి పాలసీ సంవత్సరపు బీమా చేసిన (SI) మొత్తానికి సమానమైన అదనపు బీమా మొత్తాన్ని (SI) అందిస్తుంది. క్లెయిమ్‌లతో ఎలాటి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం SI యొక్క 100% బోనస్ లభిస్తుంది. అంతేకాక ఆరోగ్యకరమైన రోజులు కార్యక్రమంతో రెన్యూవల్ ప్రీమియంపై 30% వరకు వెల్నెస్ డిస్కౌంట్ని అందిస్తుంది. ఈ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ – డిస్ట్రిబ్యూషన్ అజయ్ షా మాట్లాడుతూ, “ ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖాతాదారులకు సమగ్రమైన మరియు పటిష్టమైన ఆర్థిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ రకమైన ఆర్ధిక భద్రత మనం ఊహించని వ్యాధుల వైద్య అవసరాల సమయంలో ఆదుకుంటుంది అన్నారు. ఖాతాదారులకు మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి అవసరమైన ఆర్ధిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో అల్టిమేట్ కేర్ ఆవిష్కరించినట్లు చెప్పారు. ఈ పాలసీ తన పాలసీదారులకు గరిష్ట విలువను అందించటమే కాక అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొత్తగా పాలసీ తీసుకునే వారికి ప్రారంభ ఆఫర్ గా ప్రీమియంపై 30% వరకు తగ్గింపు అవకాశం కల్పిస్తున్నారు. మెడివోచర్లు అనేక సంవత్సరాల పాలసీ వ్యవధిలో ఒకే క్లెయిమ్ ఉంటే పాలసీ యొక్క మొదటి పాలసీ రిన్యువల్ తర్వాత ఒక్కొక్కటి రూ. 250 విలువైన రెండు ఫార్మసీ వోచర్లు లభిస్తాయి.
- Vizag vision: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కార్గో (Cargo) వాహనాల శ్రేణిని ఆవిష్కరించిన మోంట్రా ఎలక్ట్రిక్- 3.5 టన్నుల స్థూల వాహన బరువుతో ఈవియేటర్ (EVIATOR (e-SCV)) మరియు 1.2 టన్నుల స్థూల వాహన బరువుతో సూపర్ కార్గో (Super Cargo (ఈ – 3 వీలర్)) ఆవిష్కరించబడ్డాయి- ఈవియేటర్ (EVIATOR (e-SCV)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 170 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో లభిస్తుంది. అత్యధిక శక్తి – 80 kW మరియు టార్క్ – 300 Nm ఉంటాయి. దీనికి 7 సంవత్సరాలు/2.5 లక్షల కి.మీ. వారంటీ ఉంటుంది. ధర రూ. 15.99 లక్షల* నుండి (ఎక్స్-షోరూం ఢిల్లీ) ప్రారంభమవుతుంది. – సూపర్ కార్గో (Super Cargo (e-3W)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 200+ కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 150 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో, 3 కార్గో బాడీ రకాల్లో లభిస్తుంది. 15 min ఫుల్ చార్జ్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ధర రూ. 4.37 లక్షల* నుండి ప్రారంభమవుతుంది. విజయవాడ, జనవరి 22: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈవియేటర్ (‘EVIATOR’) (ఎలక్ట్రిక్ SCVలు) మరియు సూపర్ కార్గో (ఎలక్ట్రిక్ 3-వీలర్లు) వాహనాలను మోంట్రా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. సంస్థ చైర్మన్ శ్రీ అరుణ్ మురుగప్పన్, వైస్ చైర్మన్ శ్రీ వెల్లాయన్ సుబ్బయ్య, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలజ్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ 3 వీలర్ల విభాగం బిజినెస్ హెడ్ శ్రీ రాయ్ కురియన్ మరియు స్మాల్ కమర్షియల్ వెహికల్స్ విభాగం సీఈవో శ్రీ సజు నాయర్ (Saju Nair) కూడా ఇందులో పాల్గొన్నారు. “మురుగప్ప గ్రూప్‌లో భాగంగా మేము వినూత్నమైన మరియు సుస్థిరమైన, స్వచ్ఛమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ‘EVIATOR’ (e-SCV) మరియు సూపర్ కార్గోను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించడంపై సంతోషిస్తున్నాం. ఈ రెండు కొత్త ఉత్పత్తులు మా తదుపరి వృద్ధి మరియు ఆవిష్కరణలకు దన్నుగా నిలుస్తాయి.అలాగే భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ హెవీ కమర్షియల్ 55 టన్నుల ట్రక్ రైనోను (RHINO) కూడా ప్రదర్శిస్తున్నాం. ఇది ఇప్పటికే బహుళ కస్టమర్లకు 5 Mn+ పైచిలుకు కిలోమీటర్లు నమోదు చేసింది. 3W లాస్ట్ మైల్, స్మాల్ కమర్షియల్, హెవీ కమర్షియల్ మరియు ఈ-ట్రాక్టర్లు అనే 4 వ్యాపార విభాగాల్లో విస్తరించిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ 2070 నాటికి తటస్థ కర్బన ఉద్గారాల స్థాయిని సాధించేందుకు భారత్ చేస్తున్న కృషిలో కీలక పాత్ర పోషించనుంది” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) చైర్మన్ శ్రీ అరుణ్ మురుగప్పన్ తెలిపారు. “ఈవియేటర్ భారతదేశపు తొలి ట్రూ-ఈవీ (TRU-EV). ఇది అధునాతన డిజైన్, పటిష్టమైన పనితీరు మరియు అసమానమైన మన్నికతో మిడ్-మైల్ మరియు లాస్ట్ మైల్ మొబిలిటీని పునర్నిర్వచిస్తుంది. పరిశ్రమలోనే తొలిసారిగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజితో చిన్న కమర్షియల్ వాహనాల విభాగంలో ఈవియేటర్ ఒక గేమ్ చేంజర్ కాగలదు. ఫ్లీట్ అప్‌టైమ్ 95 శాతం పైగా ఉండేలా చూసేందుకు ఈవియేటర్కి అధునాతన టెలీమ్యాటిక్స్ దన్ను ఉంటుంది. ఈ ప్రోడక్టుకే పరిమితం కాకుండా, అనుకూలీకరించిన చార్జింగ్ మరియు ఆఫ్టర్‌మార్కెట్ సొల్యూషన్స్‌ను అందిస్తూ రోజువారీగా వాహనాన్ని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో తోడ్పడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. కస్టమర్ల అభిప్రాయాలను క్షుణ్నంగా తెలుసుకుని, వాటికి అనుగుణంగా సూపర్-కార్గో (ఈ 3-వీలర్) రూపొందించబడింది. కేటగిరీలోనే తొలిసారి అనదగిన డ్రైవర్స్ సీట్ బెల్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, విశాలమైన ఎర్గోనామిక్ డ్రైవర్ క్యాబిన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 15 min ఫుల్ చార్జింగ్ ఆప్షన్ ఉండటం వల్ల B2B సంస్థలకు ఇది మరింత అనువైనదిగా ఉంటుంది. విస్తృత శ్రేణిలో లభించే సూపర్ కార్గో అనేది ఇటు ఫ్లీట్ ఆపరేటర్లు మరియు వ్యక్తిగత ఎంట్రప్రెన్యూర్లకు వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా అప్‌టైమ్ మరింత మెరుగ్గా ఉండేలా మా విస్తృత డీలర్ల నెట్వర్క్ తోడ్పడుతుంది,” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలజ్ గుప్తా చెప్పారు.
- Crime property Recovery Mela #vizagvision #ytshots
- Dare 2 Bike Bajaj Pulsar bikes Demo #vizagvision #ytshots
- Aakash Launch of AIM Program to Empower Students to excel in NEET, JEE in Visakhapatnam Vizagvision
- నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఎందుకు ఉంటారు#నాగ సాధువులు#vizagvision #ytshots #హిందూ
- Vizag vision: *జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం కూటమి ప్రభుత్వానికి దశల వారీగా వినతులు..అర్హులైన వారికి ఇళ్లస్థలాలు కేటాయించాల్సిందే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం**జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల* కలెక్టరేట్, జనవరి 20,,రాష్ర్టంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ ఏ జె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.విశాఖ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏపి ఎన్ జి వో హోమ్ లో సోమవారం వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ర్టంలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని అలాగే ప్రమాధ భీమా పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని కూటమి నాయకులకు దశల వారీగా తమ రాష్ట్ర, జాతీయ యూనియన్ లు వినతిపత్రాలు అందజేశాయన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ లకు ఆయా అంశాలకు సంబంధించి తాను కూడా వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఆయా సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురు చూస్తున్నామన్నారు.విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం నియమించిన అన్ని కమిటీల్లోనూ ప్రభుత్వం పాత్రికేయులకు ప్రాతినిద్యం కల్పించాలన్నారు. అలాగే ఉమ్మడి విశాఖలో గత ఏడాది తమ యూనియన్ లలో సుమారు 800 మంది జర్నలిస్ట్ లు సభ్యులుగా చేరినట్లు చెప్పారు. ఈ సారికూడా తొలుత విశాఖ అర్బన్ యూనిట్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని , త్వరలోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు పాటుపడుతున్నామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుందన్నారు. కావున వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ నగర అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్ మోహన్, కె.శ్రీనివాసరావుతో ఉపాధ్యక్షులు వై. రామకృష్ణ,టి.కృష్ణమూర్తినాయుడు ఇతర కార్యవర్గ సభ్యులు కె వి శర్మ, రవి శంకర్, చక్రి,, ఎంవీ రాజశేఖర్,బి ఏ నాయుడు,కె. సత్య నారాయణ,బొబ్బర ప్రసాద్,వై..రాజ శేఖర్, శ్రీ లత, కిషోర్, జగన్నాధం,తదితరులంతా పాల్గొన్నారు.
- vizag vision: ఆర్ధిక పెట్టుబడులు పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు ఏలూరు . . జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును CRR డిగ్రీ కళాశాల, ఏలూరులో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.
- Vizag vision: ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.
- CARE Hospitals Achieves Historic Milestone in Robotic Surgery Visakhapatnam Vizagvision
Home News ఏడాదిికి 60 కోట్లు సరకు రవాణా ద్వారా ఆదాయం లక్ష్యం
ఏడాదిికి 60 కోట్లు సరకు రవాణా ద్వారా ఆదాయం లక్ష్యం
on: In: NewsTags:
Related Articles
-
-
-