వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తోన్న చిత్రం `ఇంద్రసేన`. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని ఇంద్రసేన ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.శ్రీనివాసన్ దర్శకుడు.
నకిలీ, డా.సలీంలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోని `బిచ్చగాడు`తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తర్వాత భేతాళుడు, యెమన్ చిత్రాలతో కమర్షియల్ హీరోగా సక్సెస్ సాధించారు. బిచ్చగాడు చిత్రంలోని మదర్ సెంటిమెంట్‌కు తన అద్భుతమైన నటనను తోడు చేసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షాన్ని కురిపించిన విజయ్ ఆంటోని `ఇంద్రసేన` చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవడానికి సిద్ధమైయ్యారు విజయ్ ఆంటోని. బ్రదర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోషన్స్ కాంబినేషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇటీవల చిరంజీవిగారు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ బావుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి సినిమాను కూడా త్వరగానే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు తెలిపారు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ,
ఆర్ట్ : ఆనంద్ మణి,
సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని,
సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్,
లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్,
నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,
దర్శకత్వం: జి.శ్రీనివాసన్.