తెలుగు ప్రేక్షకులకు. బుల్లితెర వీక్షకులకు రాజీవ్ కనకాల, సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటుడిగా రాజీవ్, వ్యాఖ్యాతగా సుమ ప్రేక్షకులందర్నీ అలరిస్తున్నారు. ప్రేక్షకులకు మరింత వినోదం అందిస్తూ ఎంటర్టైన్ చేయడానికి ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్ ఛానల్)తో పాటు ‘కె. సుమరాజీవ్ క్రియేషన్స్’ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘జుజుబీ టీవీ’ ప్రోగ్రామ్స్ గురించి వివరించారు. అలాగే, ‘కె. సుమరాజీవ్ క్రియేషన్స్’ సంస్థ నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్, పాటలను విడుదల చేశారు.
దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారు ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకులు వరా ముళ్లపూడిగారు ‘అలనాటి రామచంద్రుడు’ పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీని మీర్గారికి, రెండో సీడీని దర్శకుడురచయితనటుడు హర్షవర్ధన్గారికి అందజేశారు. ప్రముఖ దర్శకులు కొరటాల శివగారు ‘జుజుబి టీవీ’ ప్రోమోను, ‘అలనాటి రామచంద్రుడు’ పాటను విడుదల చేశారు.
దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ”రాజీవ్, సుమ స్టార్ట్ చేసిన ‘సుమరాజీవ్ క్రియేషన్స్’ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్త ప్రయోగం చేసిన ‘అలనాటి రామచంద్రుడు’ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. నేను తీసిన ఓ యాడ్ ఫిల్మ్‌లో రాజీవ్, సుమ నటించారు. నేను ఇద్దర్నీ సపరేట్గా రమ్మన్నాను. అయితే… నాకు చెప్పకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మా అమ్మాయి (సుమ)కి మంచి అల్లుడు (రాజీవ్) దొరికాడు. ఇప్పుడు ఇది (ప్రొడక్షన్ హౌస్) కూడా నాకు చెప్పకుండా స్టార్ట్ చేశారు. సో, ఇదీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ, నాకు ఒక్కటే కోపం. (నవ్వుతూ…) దర్శకుడి నేపథ్యంలో ‘అలనాటి రామచంద్రుడు’ను తీసి, నన్ను కాకుండా వేరొకర్ని పెట్టారు. ఈ ట్రైలర్లో ‘నాకు సీతను ఇచ్చావ్’ అని ఓ డైలాగ్ ఉంది. నెక్ట్స్ టైమ్ కృష్ణుడి మీద తీసినప్పుడు నన్ను పెట్టమని చెబుతున్నా” అన్నారు.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ ”సుమ, రాజీవ్‌ల స్పాంటేనిటీ, క్రియేటివిటీ మనకు తెలుసు. వాళ్ల నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏదైనా అంతే క్రియేటివిటీగా ఉంటుంది. ‘అలనాటి రామచంద్రుడు’ పాట బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీగా ఉన్నాయి. ‘అలనాటి రామచంద్రుడు’ను అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ ”కొత్త తరానికి సరికొత్త వేదిక ఈ ‘జుజుబీ టీవీ’. నేను ఎన్ని సినిమాల్లో నటించినా కొన్ని పాత్రలను సినిమాల్లో చేయలేం. అటువంటి పాత్రలు చేయడానికి, మా ఆత్మను తృప్తిపరిచే చిత్రాలు చేయడానికి, ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్‌లో) స్టార్ట్ చేశాం. సందేశాత్మక, అర్థవంతమైన షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు కామెడీ స్కిట్స్స్నిప్పెట్స్ను ‘జుజుబీ టీవీ’ ప్రొడ్యూస్ చేస్తోంది. అందులో భాగంగా ఓ గంట నిడివి గల ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘అందాల రామచంద్రుడు’ను ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్‌తో సహకారంతో నిర్మించాం. ఓ దర్శకుడి తాలూక వ్యధని కథగా తీసుకుని సందీప్ మెండి అద్భుతంగా ఆవిష్కరించాడు. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. ఇక, నా జర్నీలో తోడుగా ఉన్న సుమకు థ్యాంక్స్. అడిగితేనే దేవుడు వరాలు ఇస్తాడంటారు. నేను అడక్కుండానే నాకు సుమను ఇచ్చాడు” అన్నారు.
సుమ కనకాల మాట్లాడుతూ ”ఇంట్లో అతిథిలు ఉన్నప్పటికీ మేం అడగ్గానే వచ్చిన రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. బుజ్జి (వరా ముళ్లపూడి)గారు వేదికపై ఉంటే మాకు బాపూరమణలు వేదికపై ఉన్నట్టే ఉంది. ఈ రోజు మహేశ్‌బాబుతో సినిమా షూటింగ్ చేస్తూ, మా కోసం టైమ్ కేటాయించిన కొరటాల శివగారికి స్పెషల్ థ్యాంక్స్. ఛానల్స్ రేటింగ్స్‌తో సంబంధం లేకుండా క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడానికి ‘జుజుబీ టీవీ’ స్టార్ట్ చేశాం. ఇందులో కార్యక్రమాలన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి” అన్నారు.
జుజుబీ టీవీ ప్రొగ్రామ్స్ లిస్ట్:
1) యాంకర్ ఆడిషన్స్-కామెడీ స్నిప్పెట్
నటీనటులు: ‘జెమినీ’ సురేశ్ మరియు ఇతరులు
దర్శకత్వం: సంజయ్ కార్తీక్
2) ద డేట్-షార్ట్ ఫిల్మ్
నటీనటులు: దిలీప్‌కుమార్, మానసా జొన్నలగడ్డ, దాసన్న, రఘు కారుమంచి
దర్శకత్వం: శ్రీచైతు
3) తాగుబోతులు వర్సెస్ పెళ్లామ్స్
నటీనటులు: ఫణి, స్వప్న
దర్శకత్వం: ఎమ్మెస్ శ్రీనివాస్
4) లైఫ్ ఆఫ్ హజ్బెండ్
నటీనటులు: రామ్‌ప్రసాద్, ప్రియాంక
దర్శకత్వం: సందీప్ బొల్లశ్రీకాంత్ బిజ్జంవమన్
5) డాడ్ వర్సెస్ డాటర్స్
నటీనటులు: ‘జబర్దస్త్’ అప్పారావ్, ప్రియాంక
దర్శకత్వం: సందీప్ బొల్లశ్రీకాంత్ బిజ్జంవమన్
6) హిలేరియస్ టంగ్ ట్విస్టర్స్
దర్శకత్వం: ఎమ్మెస్ శ్రీనివాస్
7) సర్వెంట్స్ ఓమైగాడ్
నటీనటులు: స్వప్న, హారిక
దర్శకత్వం: జుజుబి టీమ్
8) ఢిల్లీ పెళ్లాంవెబ్ సిరీస్
నటీనటులు: మొయిన్, దిక్షా చత్వాల్
దర్శకత్వం: శ్రీహర్షా మన్నే