తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో క్లైమాక్స్ వచ్చేసింది. బిగ్‌బాస్ టైటిల్ ఎవరిది అనే 70 రోజుల ఉత్కంఠకు తెర పడే సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ప్లీజ్ ఓట్ ఫర్ అర్చనఅంటూ హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో అర్చన కటౌట్స్ వెలిశాయి. ప్రసాద్ ఐమాక్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీ సైజ్‌లో వెలిసిన కటౌట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
జై లవ కుశ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర వెలిసిన అర్చన కటౌట్.. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను కూడా తెగ ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్లో జై లవ కుశ పోస్టర్ కూడా యాడ్ చేశారు. అందమైన కెప్టెన్ అర్చనకు ఓటేయాలంటూ అర్చన ఫ్యాన్స్ అసోషియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది.
బిగ్‌బాస్‌లో అర్చనతో పాటు హరితేజ, ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ.. టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. మరి అర్చన బిగ్‌బాస్ విన్నర్ అవ్వడానికి ఈ కటౌట్స్ ఎంతవరకు హెల్పవుతాయాన్న విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.