సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై విలక్షణ నటుడు నారా రోహిత్, డెబ్యూ డైరెక్టర్ పవన్ మల్లెల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `బాలకృష్ణుడు`. బి.మహేంద్రబాబు, ముసునూను వంశీ, సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్ శ్రీ వినోద్ నందమూరి, మాయా బజార్ మూవీస్ సినిమా నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నారారోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాకు సంబంధించి `బాలకృష్ణుడు` అనే టైటిల్ లోగోతోపాటు, రోహిత్ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా నిర్మాతలు హేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి మాట్లాడుతూ – “నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా `బాలకృష్ణుడు` యాక్షన్, రొమాన్స్, అద్భుతమైన పాటలు ఇలా అన్నీ కమర్షియల్ హంగులతో కంప్లీట్ కమర్షియల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. దేవీ నవరాత్రులు సందర్భంగా నారా రోహిత్ హ్యండ్సమ్ లుక్‌తో ఉన్న బాలకృష్ణుడు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అలాగే బాలకృష్ణుడు టీజర్‌ను విజయదశమికి విడుదల చేస్తున్నాం. పవన్ మల్లెల సినిమాను పక్కా కమర్షియల్ మూవీగా అద్భుతంగా తెరకెక్కించారు. పృథ్వీ, వెన్నెలకిషోర్, రఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. మణిశర్మగారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. `నరసింహ` చిత్రంలో నీలాంబరిగా, `బాహుబలి` చిత్రంలో శివగామి పాత్రలోమెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ రోల్లో నటించడం విశేషం. రెజీనా కసండ్రా హీరోయిన్గా నటించింది.
నారారోహిత్, రెజీనా కసండ్ర, రమ్యకృష్ణ, పృథ్వీ, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్, పియా బాజ్‌పాయ్, అజయ్, తేజస్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెలకిషోర్, శివప్రసాద్, రఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
స్టంట్స్ః విజయ్,
కాస్ట్యూమ్స్ః నరసింహారావ్,
ఆర్ట్ః ఆర్.కె.రెడ్డి,
గ్రాఫిక్స్ః మేట్రిక్స్ వి.ఎఫ్.ఎక్స్,
కథ, మాటలుః కొలుసు రాజా,
మ్యూజిక్ః మణిశర్మ,
సినిమాటోగ్రఫీః విజయ్ సి.కుమార్,
ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు,
లైన్ ప్రొడ్యూసర్ః డి.యోగానంద్,
నిర్మాతలుః బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః పవన్ మల్లెల.