జగన్ చేసింది రిలే పాదయాత్ర అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాదయాత్ర అనేది ఒక గొప్ప ప్రక్రియ వై ఎస్ ఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, ఇప్పడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అని అన్నారు గతంలో జగన్ రిలే పాదయాత్ర చేశారు గురువారం సాయంత్రం విరామం తీసుకుని మళ్ళీ సోమవారం మొదలు పెట్టేవారు అని ఎద్దేవా చేశారు లోకేష్ మాత్రం విరామం లేకుండా పాదయాత్ర చేస్తున్నారని లోకేష్ 2000 కిలో మీటర్లు పాదయాత్ర లో 30 లక్షలు మందిని కలుసుకున్నారు లోకేష్ పాదయాత్ర లో
సెల్ఫీ ఛాలెంజ్ ఒక అద్భుత గుర్తింపు పొందింది వై ఎస్ ఆర్ పార్టీ కొంత అడ్డంకి కల్గించారు.
తరవాత రెవిన్యూ. అధికారులుతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు పాదయాత్ర కి వస్తున్న స్పందన చూసి ఒర్వ లేకపోతున్నారని అన్నారు
వైసిపి నవరత్నాలు పధకాలు పై మాట్లాడుతూ పధకంలో 98 శాతం అమలు చేసాం అంటారు మద్యపాన నిషేధం ఎక్కడ అమలు చేశారు అని ప్రశ్నించారు ఎక్కడ గంజాయి దొరికినా అది మన రాష్ట్రంలో ఏరులై పారుతోంది
పెన్షన్ ను మూడు వేలు చేస్తామన్నారు ఇప్పటికి చెయ్యలేదు ప్రజలు అన్ని సందర్భంలో మోసపోయారు
రాజమండ్రి లో విదుడల చేసేన మేనిఫెస్టో తో వైసీపీ లో వణుకు పుట్టింది విశాఖ రుషి కొండ బీచ్ ప్రవేశ రుసుము 20 రూపాయిలు అన్నారు టూరిజం అధికారులు శ్రీనివాస్ పాణి అంతర్గత ఆదేశాలు పత్రాన్ని ఇచ్చారు ప్రజా వ్యతిరేకత తో వెనక్కి తగ్గారు.
ఇప్పటికైనా రుషి కొండ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము అని చెప్పారు
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు సందర్శించే బీచ్ లు మీద వసూలు చేయాలి అనుకోవడం దారుణం బీచ్ లను ఆదాయ వనరు గా చూడటం శోచనీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ వార్డ్ వాలంటీర్లు మీద మాట్లాడిన విషయానికి నోటీసులు ఇవ్వడం దారుణం
దీని పై విచారణ చేయాలి గాని నోటీసులు ఇవ్వడం సరికాదని చెప్పారు వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి సేవ్ వైజాగ్ పేరిట పోరాటాలు చేశారు తిరిగి విశాఖ లో ఆస్తులు కొల్లగొట్టారు దసపల్లా భూముల్లో స్వయంగా విజయసాయి రెడ్డి అల్లుడే కొనుకున్నారు అని ఆరోపించారు
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర లో ప్రతి వంద కిలోమీటర్ కు వేసే శిలా ఫలకం పై ప్రజలకు ఇచ్చే హామీలు పొందుపరుస్తున్నారు అని అన్నారు లోకేష్ పాదయాత్ర లో యువత, మహిళ, ఇతర వర్గాల బృంద సమావేశాలో అప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు అని అన్నారు
రోజుకు షెడ్యూల్ లో 10 కిలోమీటర్లు ఉంటే 13.5 కిలోమీటర్లు నడుస్తున్నారు.
నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగ ప్రకటన లేదు కొన్ని లక్షల మంది ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నారు సమావేశంలో శాసనసభ మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జి ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చిక్కాల విజయబాబు భోగి రమణ అకిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు