తిరుమలలో అఖిలాండకోటి నాయకుని బ్రహ్మోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడవీధుల విహరించారు.
శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో కల్కిగా అవతరిస్తాడని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అశ్వం అంటే వేగానికి ప్రతీక. అందుకనే మన ఇతిహాసాలతో పాటు చరిత్రలో అశ్వానికి విశిష్టమైన స్థానముంది.
చతురంగ బలాల్లో అశ్వదళానిదే కీలకపాత్ర. మలయప్పస్వామి అశ్వవాహనంపై ఒంటరిగా శిరస్త్రాణాన్ని ధరించి చేతిలో ఖడ్గం చేతబూనిభక్తులకు దర్శనమిచ్చారు.
అమృతం కోసం సాగరాన్ని మధించిన సమయంలో ఉచ్ఛైశ్రవం అనే అశ్వరాజం జన్మించింది.
కఠోపనిషత్తులో మానవ ఇంద్రియాలను అశ్వాలుగా పేర్కొన్నారు.
కలియుగం చివర్లో స్వామి కల్కి రూపంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తారు.
అశ్వవాహనంపై ఆసీనులైన స్వామివారిని దర్శిస్తేభక్తులకు భౌతికమైన జ్ఞానేంద్రియాలను కట్టుదిట్టం చేసి దివ్యమైన జ్ఞానం ప్రసాదిస్తారు.