దీపావళి తరువాత పట్టాభిషేకం..?కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దీపావళి తరువాత పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అందుకుంటారని యువనేత సచిన్ పైలెట్ ఆదివారం ప్రకటించారు. రాజకీయాల్లో వ్యక్తులు సాధించిన విజయాలే అతని సమర్థతకు గాటురాయి అని అని ఆయన చెప్పారు. ఇంటి పేరు అనేది.. ఆయా నేతలకు భారం కాదని ఆయన చెప్పారు. ప్రస్తుతం పార్టీని ఉపాధ్యక్షస్థానం నుంచి నడిపిస్తున్న రాహుల్ గాంధీ.. దీపావళి తరువాత.. అధ్యక్ష బాధ్యతలు తీసుకుని.. పార్టీని గాడిన పెడతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీ గాడి తప్పిన ప్రతిసారీ.. ఒక గాంధీ వారసుడు బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించారని.. ఇదే సెంటిమెంట్ రాహుల్ గాంధీ విషయంలో మరోసారి రుజువు అవుతుందని చెప్పారు.
రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా వాద్ర కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని సచిన్ పైలెట్ తెలిపారు. అయితే ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం.. రాకపోవడం అనేది ఆమె వ్యక్తిగత విషయం అని అన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలు అత్యంత సహజమని.. అదేమంత నేరం కాదని చెప్పారు. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చే వారికి ప్రజా సేవపైన పూర్తి అవగాహన ఉంటుందని అన్నారు.