హైదరాబాద్: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, కర్నాటక మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించింది. కోస్తా, ఆంధ్రాకు ఆనుకుని రాయలసీమ వరకు మరో ఉపరితల ఆవర్తనం, ఉత్తర అండమన్, ఆరకాస్ తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.