శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ టికెట్ ధరను పెంచారు.టికెట్ ధర రూ.300 నుంచి రూ.500లకు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది*. పెంచిన టికెట్ ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ టికెట్లతో రోజు 2500 మంది భక్తులు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.750, రూ.1500, రూ.3000, రూ.5000 టికెట్ ధరలు యాధాతథంగా ఉంటాయని చెప్పారు.
పూజా కార్యక్రమంలో ఉంచే వెండి విగ్రహాలను హుండీలో వేయాలని తెలియక పోవడంతో కొందరు భక్తులు తమ వెంట తీసుకెళుతున్నారని, దీనివల్ల ఆలయంలో వెండి తరిగిపోయిందని, ఆ నష్టాన్ని పూడ్చడానికే టికెట్ ధర పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగానే టికెట్ ధర పెంచాల్సి వచ్చిందని తెలిపారు. లడ్డూ ప్రసాదం ధరను కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు…