HomeUncategorizedVisakhapatnam Vizagvision : దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని విశాఖ సమాచారం దినపత్రిక ఎడిటర్ సూరంపూడి వీరభద్ర రావు అన్నారు. ఆదివారం దివ్యాంగుల సేవ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం తోట గురువు ఎర్నిమాంబ ఆలయం దగ్గరలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొని వారిలో ఉత్తేజం నింపారు.డాక్టర్ కేజీబీఎస్ మూర్తి మాట్లాడుతూ దివ్యాంగులమనే భావన ప్రక్కనపెట్టి ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని,వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటి రవికుమార్ వీరికి భోజన సదుపాయం కల్పించారు. అల్వికెన్ అసోసియేషన్ గోపి దివ్యాంగులకు కళ్లద్దాలు పంపిణీ చేసారు.డాక్టర్ బీవీకే రాజు,గోపాల కృష్ణ,దివ్యాంగుల సేవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి రామరాజు, మోహన్, నాగేంద్ర, గురుమూర్తి, గంగరాజు, సుధాకర్,తులసి రామ్, అనంత్, రఘునాధ్ పండా, Sk ఖుదా భాష తదితరులు ఈవేడుకల్లో పాల్గొన్నారు.ఈ వేడుకల్లో పాల్గొన్నదివ్యాంగులు ఆటపాటలతో,కేరింతలతో ఉల్లాసంగా గడిపారు….
Visakhapatnam Vizagvision : దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని విశాఖ సమాచారం దినపత్రిక ఎడిటర్ సూరంపూడి వీరభద్ర రావు అన్నారు. ఆదివారం దివ్యాంగుల సేవ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం తోట గురువు ఎర్నిమాంబ ఆలయం దగ్గరలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొని వారిలో ఉత్తేజం నింపారు.డాక్టర్ కేజీబీఎస్ మూర్తి మాట్లాడుతూ దివ్యాంగులమనే భావన ప్రక్కనపెట్టి ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని,వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటి రవికుమార్ వీరికి భోజన సదుపాయం కల్పించారు. అల్వికెన్ అసోసియేషన్ గోపి దివ్యాంగులకు కళ్లద్దాలు పంపిణీ చేసారు.డాక్టర్ బీవీకే రాజు,గోపాల కృష్ణ,దివ్యాంగుల సేవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి రామరాజు, మోహన్, నాగేంద్ర, గురుమూర్తి, గంగరాజు, సుధాకర్,తులసి రామ్, అనంత్, రఘునాధ్ పండా, Sk ఖుదా భాష తదితరులు ఈవేడుకల్లో పాల్గొన్నారు.ఈ వేడుకల్లో పాల్గొన్నదివ్యాంగులు ఆటపాటలతో,కేరింతలతో ఉల్లాసంగా గడిపారు….