టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు,తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంపాదించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పలువురు నేతలతో సమావేశమైన ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని, కార్యకర్తల బలం క్షేత్రస్థాయిలో పార్టీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.