రాష్ట్ర ఖజానా లోటులో ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేందకు సీఎం కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో మూడో విడత రైతు ఉపశమన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేనాటికి రూ.16వేల కోట్ల లోటు ఉందని, ఇప్పుడు లోటు రూ.20వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి మొత్తం రూ.1.22 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. అప్పులు తెస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా పాలన సాగిస్తున్నట్టు యనమల చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జడ్పీ ఛైర్పర్సన్ అనురాధ, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.