కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23న అమ్మవారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. గతేడాది నిర్వహించిన గాజుల ఉత్సవానికి మంచి స్పందన లభించింది. అందుకే ఈ ఉత్సవాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు మల్లికార్జున మహా మండపంలో ఉత్సవమూర్తిని, ఆలయాన్ని గాజులతో అలంకరిస్తారు. దీనికోసం భక్తులు అమ్మవారికి గాజులను విరాళంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా గాజులు భక్తుల నుంచి సమకూరాయి. ఈ నెల 23న కనకదుర్గమ్మ గాజుల దుర్గమ్మగా దర్శనం ఇవ్వనున్నారు