VIZAGVISION:Two Women were Badly Beaten & Threatened Butchayyapeta,Visakhapatnam..విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం మల్లం గ్రామంలో జరిగిన దారుణం ఒక రియల్టర్ మూడున్నర ఎకరాల భూమి కబ్జా చేసేందుకు మల్లం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి వెంకటలక్ష్మి భూములను సరిహద్దుల్ని కలిపేయాలని చాలారోజుల నుంచీ చూస్తున్నాడు. బుధవారం ఉదయం నేరుగా మహిళలను పొలంలోకి పిలిపించి రౌడీలతో వారిపై దాడి చేయించాడు. కాళ్ళు చెతులు కట్టి మూతికి గుడ్డకట్టి పొలంకు వస్తే చంపేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు. సినీఫక్కీలో జరిగిన ఈ రౌడీకాండకు మహిళలు బెదిరిపోయారు. ఈ సంఘటన సంచలనం రేపుతుంది.పొలంకి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లారు. అక్కడ దారుణమైన స్థితిలో ఉన్న ఇద్దరు మహిళల్ని చూసి అవాక్కయ్యారు. వారిని విడిపించి, అప్పటికే పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోమహిళలు చికిత్సపొందుతున్నారు. ఇంతటి ఘాతుకానికి కారణమైన రియల్టర్, రౌడీయిజం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కుటుంబీకులు. దాడికి పాల్పడిన వ్యక్తి అనకాపల్లికి చెందిన వాడిగా చెబుతున్నారు. ఘటనజరిగి పదిగంటలు దాటుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరుస దారుణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో..చూడాలి