VIZAGVISION:International Agriculture technology Hackathon at Vizag AP CM Chandrababu Visakhapatnam…విశాఖలో ఏపీ అగ్రిటెక్ సదస్సు బుధవారం ప్రారంభమైంది.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ వ్యవసాయ విధానాలపై ప్రదర్శనలు, అన్నదాతల సమస్యలకు పరిష్కారం చూపేలా సదస్సును నిర్వహిస్తున్నారు.
కాగా… కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ రేపు సదస్సుకు విచ్చేయనున్నారు.
అలాగే 17వతేదీన సదస్సు ముగింపు రోజున బిల్‌గేట్స్ హాజరవుతున్నారు.
ఈ సందర్బంగా బిల్ అండ్ మిలిందాగేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.