రాహుల్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 8న రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. ఈ ఏడాది చివరి లోగా అధ్యక్షుడును ఎన్నుకోవాలంటూ ఈసీ ఇచ్చిన అల్టిమేటంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమౌతున్నాయి.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గుజరాత్ ఎన్నికలకు ముందే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 నుంచి గుజరాత్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. పందొమ్మిదేళ్ల కిందట కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ పగ్గాలను రాహుల్కు అప్పగించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 2013లో రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా నియమించారు.. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి.
. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధ్యక్ష బాధ్యతలను రాహుల్కు అప్పగించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై అధ్యక్ష ఎన్నికలపై స్పష్టతను ఇవ్వనుంది.సోనియాగాంధీ నివాసమైన 10 జన్పథ్లో సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను ఈ సమావేశంలో నేతలు అమోదించనున్నారు.
ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల్లో రాహుల్ ఒక్కరే ఉండనున్నారు. ఎన్నికల షెడ్యూల్ను సీడబ్ల్యూసీ ఆమోదించగానే పార్టీ కేంద్ర ఎన్నికల విభాగం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేయనుంది.పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గుజరాత్ ఎన్నికలకు ముందే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 నుంచి గుజరాత్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈలోపుగా అంటే డిసెంబర్ 8న రాహుల్ ఎన్నిక ఉంటుందని సీడెబ్ల్యూసీ వర్గాలు సూచన ప్రాయంగా చెబుతున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈసీ ఆ పార్టీకి డెడ్ లైన్ పెట్టింది.