VIZAGVISION:Araku Glasses Train Started to take off Everryday,,Visakhapanam…అరకు అద్దాలు రైలు తాత్కలికంగా పునంప్రారంభం
*3200 రుపాయలు ప్యాకేజితో పర్యాటకులను తిప్పనున్న పర్యాటక శాఖ
*పర్యాటకులు తగ్గడంతో ప్రత్యామ్నాయ ఎర్పాట్లు చేసిన రైల్వే అదికారలు
కిరండోల్-కొత్తవలస రైలుమార్గంలో 249వ పిల్లర్ దెబ్బతినడంతొ అరకు అందాలు రైలు మార్గంలో చూసేందుకు ఇష్టపడే పర్యాటకులు బ్రెక్ పడింది…అయితే ఇది సీజన్ కావడంతొ అరకు ప్రర్యాటకులు కోసం ప్రత్యామ్నాయ ఎర్పాట్లు రైల్వే పర్యాటక అదికారులు చేపట్టారు…అరకు అద్దాల రైలు పాక్షికంగా పునఃప్రారంచనున్నారు…
మంచు తేరలు అరకును కప్పతుంటే ఆ చలిమంచు తెరలను చూసేందుకు పర్యాటకులు ఉత్సహం చుపుతారు వారికి కోసం ఈ నెల 28 నుంచి అరకు అద్దాల రైలు బోగిను విశాఖపట్నం-చిమిడిపల్లి మధ్య రాకపోకలు సాగించనున్నారు. కొత్తవలస-కిరండోల్ (కేకే) రైలు మార్గంలో గత నెల కురిసిన భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో వంతెన దెబ్బతింది. దీంతో సుమారు నెలన్నర నుంచి ఈ మార్గంలో రైళ్లు రద్దు చేశారు. అయితే పర్యాటకుల నుంచి ఒత్తిడి రావడంతో రైల్వే, పర్యాటక శాఖ అధికారులు ఈ నెల 28 నుంచి అద్దాల కోచ్‌ను నడపాలని నిర్ణయించారు. ఈ అద్దాల రైలు ప్రతిరోజు ఉదయం 6:50 నిమిషాలకు విశాఖ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది.పది గంటలకు చిమిడిపల్లి చేరుకుని, తిరిగి పదిన్నర గంటలకల్లా టైడా రైల్వేస్టేషన్‌కు వస్తుంది.అక్కడ నుంచి బస్సులో పర్యాటకులను బొర్రాగుహలకు, మధ్యాహ్నం 12 గంటలకల్లా అరకు తీసుకువెళతారు. గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్ చూపించి సాయంత్రం 5.30 గంటలకు అనంతగిరి తీసుకువస్తారు. రాత్రి 8 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ ఖరీదు రూ.3,200. ఇతర వివరాలకు 9848023948, 9848813584 నంబర్లలో సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారి తెలిపారు.