పోలవరం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి , లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారయణ పిలుపు….పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీలు బేషజాలు వదిలిపెట్టి పోరాటానికి ఏకం కావాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గుంటూరులో లోక్‌సత్తా సురాజ్య యాత్రను శుక్రవారం ఆయన హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతలు నెరవేర్చడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల బతుకులు మార్చాలని విజ్ఞప్తి చేస్తూ సురాజ్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నట్లు జేపీ వెల్లడించారు.