VIZAGVISION:TTD Tirumala Laddu price increases,Tirumala…శ్రీవేంకటేశుని లడ్డూ,వడ ప్రసాదాల దరలను పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కల్యాణోత్సవాలు, ఆలయాల కుంభాబిషేకాలు, ఇతరాత్రా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విజ్ఙాపనలపై టీటీడీ లడ్డూ,వడ ప్రసాదాలను విక్రయిస్తుంది. ఇకపై సరఫరా చేసే ప్రసాదం ధరలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. సిపార్సులపై ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకోనే భక్తులకు ఎలాంటి మార్పు లేకుండా లడ్డు పడి టికెట్ల పేరిట జారీ చేసే ప్రసాదం ధరలను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుంటోంది.
ఎలాంటి సిపార్స్ లేకుండా అధిక ధరలపై కోరినన్ని లడ్డూలను భక్తులకు అందజేయాలని భావిస్తోంది.మొదట ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేసేందుకు పెంపు నిర్ణయం తీసుకుంది.
సాధారణ లడ్డూను 25రూ నుంచి 50 రూపాయలకు, శ్రీవారి కల్యానం లడ్డూ ధరను రూ 100 నుంచి 200కు గాను,వడ రూ 25 నుంచి 50రూపాయలకు గాను, మిని లడ్డును