VIZAGVISION:Recording Dances in Public Schools are Obscene Dances,East Godavari District..తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం అయిన ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి లో అమ్మ వారి జాతరలో నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ పాఠశాలలో రికార్డింగ్ డాన్సులు అశ్లీల నృత్యాలు వంటి అసాంఘీక కార్యకలాపాలు ఇక్కడ కనిపించాయి. ఈ వ్యవహారం పై పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో యువత పెడదారిన పడుతుందని ఆ గ్రామంలో మహిళలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలో వివిధ గ్రామల్లో రికార్డింగ్ డ్యాన్సులు,కోడి పందెలు అసాంఘిక కార్యక్రమలు ఎక్కువగా జరుగుతున్నా పోలిసులు పట్టించుకోవాడంలేదని ప్రజలు వాపోతున్నారు. భక్తి పేరుతో రక్తిని భోదించినట్లు అమ్మవారి జాతర లో అందులోని చదువు చెప్పే చోట నగ్న ప్రదర్శన డ్యాన్స్ లు చేయడం సరికాదని దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని అక్కడ గ్రామస్తులు కోరుతున్నారు.