VIZAGVISION:Sonia Gandhi’s sensational decision Good bye to politics,NewDelhi… రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా పని చేసిన సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. ఈ మేరకు ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో సోనియా తన రిటైర్మెంట్ ప్రకటించారు.
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం పార్లమెంటు ప్రారంభమై, ఆ తర్వాత వాయిదా పడ్డాయి. సభ వాయిదా అనంతరం ఆమె తిరిగి వెళ్తుండగా ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుందని అడిగారు.
దానికి సోనియా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు.
19 ఏళ్లు అధ్యక్షురాలిగా
19 ఏళ్లు అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి 19 ఏళ్లకు పైగా అధ్యక్షురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇంతకాలం ఉన్న వారు ఎవరూ లేరు. ఎక్కువకాలం పార్టీ బాధ్యతలు భుజాన మోసిన అధినేత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
జననం
1946లో జననం
సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. 1998 మార్చి 14న పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రధాని పదవి తీసుకోమని చెప్పగా నిరాకరించారు. ఆ తర్వాత ఐదేళ్లకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో పార్టీ చీఫ్ అయ్యారు. 2004లో లోకసభలో యూపీఏకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.
మిస్సయింది
ప్రధాని అవకాశం మిస్సయింది
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టవలసి ఉంది. కానీ విదేశీయురాలు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో, బీజేపీ సహా పలు పార్టీలు విమర్శలు చేయడంతో ఆమె తగ్గారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
విదేశీ అధ్యక్షురాలు
మొదటి విదేశీ అధ్యక్షురాలు
185 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం రాకముందు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక తొలి విదేశీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.
జననం
ఎక్కడ జన్మించారంటే
సోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో. ఇటలీలోని లూసియానా దగ్గరలోని కంట్రడా మెయినీ గ్రామంలో జన్మించారు. వీరు రోమన్ కేథలిక్లు. 1964లో బెల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భాషా స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కేంబ్రిడ్జ్ వచ్చారు. అక్కడ గ్రీక్ రెస్టారెంటులో 1965లో రాజీవ్ గాంధీని కలిశారు. వీరిద్దరు 1968లో హిందూ వివాహ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక అత్త, నాటి ప్రధాని ఇందిరా గాంధీ నివాసానికి మకాం మార్చారు.