దుర్గగుడి ఈఓగా సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయనను తక్షణం రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
దుర్గగుడిలో తాంత్రిక పూజల నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం ఈవో గా ఉన్న సూర్యకుమారిపై ప్రభుత్వం వేటు వేసింది. దుర్గమ్మ ఆలయంలో రహస్య పూజల వివాదం పలురకాల మలుపులు తిరుగుతుండటం, సంక్షోభం మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రహస్య పూజల విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఈఓగా పనిచేస్తున్న సూర్యకుమారి ని ఆ పదవి నుంచి తప్పించింది.