Vizag Vision:హజ్ యాత్రపై సబ్సిడీ రద్దు గురించి ముస్లింలేమంటున్నారు….హజ్ యాత్ర కోసం ముస్లింలకు అందించే సబ్సిడీని రద్దు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
ముస్లింలను బుజ్జగించడానికి బదులు, వారికి సాధికారత కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం నాడు హజ్ సబ్సిడీని రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ధృవీకరించారు.
“స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటి సారి 1.75 లక్షల ముస్లింలు సబ్సిడీ లేకుండా హజ్ యాత్ర చేయబోతున్నారు. గత సంవత్సరం మొత్తం 1.25 లక్షల మంది హజ్‌కు వెళ్లారు” అని మంత్రి చెప్పారు.