Vizag Vision;Sri Sathya Sai Education Vihar School 69th Republic Day Celebrations,visakhapatnam..అత్యంత వేడుకగా స్వాతంత్య్ర స్ఫూర్తితో , దేశ భక్తితో శ్రీ సత్య సాయి విద్య విహార్ స్కూలు లో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు,భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీ సత్య సాయి విద్య విహార్ స్కూలు లో అత్యంత వేడుకగా స్వాతంత్య్ర స్ఫూర్తితో , దేశ భక్తితో జరిగాయి.ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత నౌకాదళ విశ్రాంత కామోడోర్ పి ఏ రామన్ భారత జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో స్కూలు కన్వీనర్ మరియు శ్రీ సత్య సాయి సేవ సంస్థల ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎస్ జి చలం, స్కూలు ప్రిన్సిపాల్ శ్రీమతి అయ్యగారి కౌసల్య, అనేక మంది, స్కూలు విద్యార్థులు, స్కూలు సిబ్బంది, తల్లి తండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామోడోర్ పి ఏ రామన్ స్కూలు లో కొత్త కెప్టెన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కొత్త కెప్టెన్లు భారత సంస్కృతి, సంప్రదాయాలను పరి రక్షిస్తామని , చక్కటి నడవడికతో నడుచుకుంటామని ప్రమాణం చేశారు.విద్యార్థులు తాము వ్యవహరించే ప్రవర్తన, వైఖరి విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ దేశస్థుల ప్రవర్తన, వైఖరి విషయం గురించి ప్రస్తావించారు. ఆ దేశ పౌరులు తమ డిమాండ్లను సాధించడం కోసం పని పూర్తి చేసిన తరువాత మాత్రమే వినమ్రతతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నిరసన వ్యక్త పరుస్తారని. తాము పని చేసే సంస్థలకు ఎటువంటి నష్టం కలుగకుండా , క్రమశిక్షణ , అకుంఠ దీక్షతో అంకిత భావంతో పని చెయ్యడం జపాన్ దేశస్థుల నుంచి నేర్చు కోవాలని. మానవ విలువలతో నేర్చుకున్న విద్యతో సమాజానికి మంచి పేరు తేవాలని ఆయన చిన్నారులకు పిలుపునిచ్చారు.