Vizag Vision;Republic Day celebrations in Delhi Prime Minister Narendra Modi,Delhi..దేశరాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలను ప్రదర్శించారు.ఆసియాన్ దేశాల విద్య, వైద్యం, సాంస్కృతిక వైవిధ్యాలపై ప్రదర్శించిన శకటాలు, ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అలాగే మేక్ ఇన్ ఇండియా, ఖేలో ఇండియా, ఆదాయపన్ను శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ, ఆల్ఇండియా రేడియా, సరిహద్దు దళాలు, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.
సబర్మతి ఆశ్రమం థీమ్‌తో గుజరాత్, ఛత్రపతి శివాజీ థీమ్‌తో మహారాష్ట్ర, అడవిలో వన్యమృగాలకు సంబంధించిన థీమ్‌తో కర్ణాటక, చేతివృత్తుల థీమ్‌తో త్రిపుర, బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన థీమ్‌తో మధ్యప్రదేశ్ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించాయి. తర రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా ఆకట్టుకున్నాయి.జాతీయ సాహస బాలల అవార్డులు అందుకున్న 18 మంది పిల్లలకు పరేడ్‌లో విశేష గౌరవం దక్కింది.
వారు ప్రత్యేకమైన వాహనాల్లో పరేడ్‌లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టకున్నాయి. బీఎస్ఎఫ్కు చెందిన మహిళా బైకర్స్ బృందం ప్రదర్శించిన విన్యాసాలకు విశేష స్పందన లభించింది.