Vizag Vision:ACB Ride on Additional Chief Urban Planner in Vuda ,Visakhapatnam..విశాఖ వుడాలో అవినీతి అదికారి బాగోతం బట్టబయలైంది.అవినీతి పెంచి పోషిస్తున్న అదికారులపై పలు ఫిర్యాదులు అందుకుంటున్న ఏసీబీ అదికారులు రంగంలోకి దిగి అదికారుల ఆటకట్టిస్తున్నారు.వుడాలో అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ పని చేస్తున్న ప్రదీప్ కుమార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు ఎకకాలంలో దాడులు చేసి అవినీతి సొమ్ము లేక్కకడుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో12 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.విశాఖలోని దసపల్లా హిల్స్ లో నటరాజాటవర్స్ లో విజయవాడ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.దీంట్లో 4లక్షల నగదుతో పాటుగా ఒక కేజీ బంగారు ,5కేజీల వెండి వస్తువులు గుర్తించారు.రాజమండ్రి,మైదుకూరులతో పాటు విశాఖలోని మధురవాడ, కిర్లంపూడి లేఅవుట్ లో ఓ అపార్ట్ మెంట్లు వెలుగుచూసినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.1984లో విధుల్లో చేరాడు ప్రదీప్ కుమార్ , సిటీ అండ్ కంట్రీ ప్లానర్ విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న ప్రదీప్ కుమార్ రెండు వారాలక్రితమే వుడాలో చీఫ్అర్బన్ ప్లానర్ గా బాధ్యతలు చేపట్టాడు.ఈ క్రమంలో ఏసీబీ అదికారులకు పట్టబడడంతో చర్చనియాంసంగా మారింది.