జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా దేశ రాజధానిలోని ఆయన సమాధి రాజ్‌ఘాట్ ప్రముఖులు నివాళులర్పించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.