ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నడుపుతోందన్నారు.
ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆరెస్సెస్ వ్యక్తులను పెట్టారన్నారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్న తరుణంలో రాహుల్ గాంధీ హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో నాలుగు రోజులపాటు పర్యటించారు.
చివరి రోజు ఆయన వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నడుపుతోంది. అది తన ప్రతినిథులను ప్రతి చోట పెట్టింది.
మంత్రిత్వ శాఖల కార్యదర్శులను సైతం ఆరెస్సెస్సే నియమిస్తోంది’’ అన్నారు.
పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం కూడా ఆరెస్సెస్దేనన్నారు.
ఆ నిర్ణయాన్ని తీసుకున్నది భారతీయ రిజర్వు బ్యాంకు కాదన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీని సవరిస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు.
పన్ను శ్లాబులను తగ్గిస్తామన్నారు. ప్రస్తుతం జీఎస్టీ చాలా ఎక్కువగా ఉందన్నారు.