Vizag Vision:Apanna Dollu utas honored Simachalam ,Visakhapatnam…సింహచలంలో అప్పన్న డోలోత్సవం ఘనంగనిర్వహించారు. ప్రతి ఏటా జరిగే వార్షిక కళ్యాణమహోత్సవాలు ముందువచ్చే పాల్గుణ పౌర్ణమిరోజున స్వామివారికి పెళ్ళిచూపులు తంతులో భాగంగ డోలోత్సవం జరపడం అనవాయితి దీనినే బొట్టునడిగే పున్నమిగా పిలుస్తారు. ఉత్సవంలో భాగంగా ముందుగా స్వామివారిని ప్రాతఃకాలనే సుప్రభాతసేవతో మేల్కోపి శోడషోపచారపూజలు నిర్వహించి అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకిలో అదిష్టింపచేసి మెట్లమార్గం గూండ కొండక్రింద గల పుష్కరిణి వద్దకు తోడ్కోనివచ్చి డోలిలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఆశ్శీనులు చేసి శోడషోపచార పూజలు నిర్వహించారు.అనంతరం వేదమంత్రల మంగళవాయిద్యల నడుమ వంసతాలను ప్రదక్షనగాయించి స్వామివారికి సమర్పించి కర్ఫూరనీరాజనాలు సమర్పించారు.భక్తులు ఉత్సవంలో పాల్గోని స్వామివారి తీర్ధప్రసదాలు స్వీకరించారు.