Vizag Vision:National TRIATHION Championship-2018,Visakhapatnam..1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్… 40 కిలో మీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్నింగ్… ఇది విశాఖ లో జరుగుతున్న ట్రైథ్లాన్ ఛాంపియన్ షిప్.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 90 మందికి పైగా పార్టీసిపెంట్స్ ఇందులో పాల్గొన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ పోటీలను ప్రారంభించారు. విశాఖలో మూడవ సారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని కమిషనర్ యోగానంద్ అన్నారు. సాగరతీరం లో
ట్రైథ్లాన్ పోటీలు నిర్వహించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో సముద్రంలోని స్విమ్మింగ్ నిర్వహించిన నిర్వాహకులు ఈ సారి స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించారు. ప్రస్తుతం సముద్రం అనుకూలంగా లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే క్రీడాకారులను ఈ ఛాంపియన్ షిప్ నుంచి సెలెక్ట్ చేయనున్నారు. ఇంత కఠినమైన పోటీల్లో అమ్మాయిలు కూడా పాల్గొనడం విశేషం….