Vizag Vision:AP CM Congratulates KGB students received invitation to NASA,Vijayawada…నాసా ఆహ్వనం పొందిన కేజీబీవీ విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఆహ్వానం పొందిన మన రాష్ట్రానికి చెందిన 11 మంది కేజీబీవీ విద్యార్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
పేద కుటుంబాల నుంచి వచ్చి..ప్రభుత్వ ప్రోత్సాహంతో కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదువుతున్న ఈ విద్యార్థునులు కృషిని ఆయన ప్రశంసించారు.
నాసా ఆహ్వానం పొందిన విద్యార్థునులు… మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ను కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన రాష్ట్ర విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలని, నవ్యాంధ్రకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు.
పేద కుటుంబాల నుంచి వచ్చి ప్రతిభ కనబరుస్తూ ముందుకెళుతుండటం సంతోషంగా వుందన్నారు.
కష్టపడటం వల్లే ఎవరి అభివృద్ధి అయినా సాధ్యం అవుతుందన్నారు
ఇదే తీరులో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అంతరిక్షంలో ఆవాసాలు అనే అంశంపై ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించి కేజీబీవీ విద్యార్థినులు నాసా కు పంపించారు.
వాటిని పరిశీలించిన అనంతరం… ఈ కేజీబీవీ విద్యార్థునులను లాస్ఏంజెల్స్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు నాసా ఆహ్వానించింది.విద్యార్థునుల కృషికి గుర్తింపుగా ఆహ్వానాన్ని పంపించింది. మే 24న జరిగే సదస్సుకు కేజీబీవీ విద్యార్థునులు వెళ్లనున్నారు.
విదేశాలలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థునులు వెళ్లడం ఇదే తొలిసారి.
ఈ విద్యార్థులంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. అందులోనూ కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, డ్రాపౌట్స్, సెమీ ఆర్ఫన్, కూలీ చేసుకొంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారే. కేజీబీవీ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్న ఎస్.ఎస్.ఏ ఎస్పీడీ జి.శ్రీనివాసులును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినంధించారు.