Vizag Vision;Way the talk for the railway zone is not appropriate YSRCP Amarnath Visakhapatnam.ఈ ప్రాంత ప్రజల మనోభావలు దెబ్బతిన్నాయి. దశాబ్దాలుగా జోన్ కోసం ఎదురుచూస్తున్న తరుణం లో కేంద్రం ఈ విధంగా మాట్లాడడం దురదృష్టం. ఆనాడు విభజన నాటినుండి విశాఖ కు అన్యాయం జరిగింది. రైల్వే జోన్ కాదు విశాఖ కు మెట్రో లైన్ ఇస్తమనడం చూస్తుంటే ఈత కాయ ఇచ్చి తాటికాయ పట్టుకు పోతమన్నట్టు ఉందని ఆయన అన్నారు. దేశం లో ఉన్న అన్ని రైల్వే జోన్స్ కన్న వాల్తేరు డివిజన్ నుండి అధిక ఆదాయం వస్తున్న విషయం గమనించాలన్నారు. జోన్ ఏర్పాటుకు ఫెసభిలితి అంటున్నారు. దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన ఏ రైల్వే జోన్ కు ఉందని అన్నారు. తెలుగు దేశం రైల్వే జోన్ విషయం లో నాటకాలు అడుతున్నయన్నారు. ఒక పక్క ఆ పార్టీ సీఎం జోన్ ఏర్పాటు చెయ్యాలని అంటారు. మరో పక్క ఆ పార్టీ ఎంపీ లు వేరు వేరు ప్రాంతాల పేరులు చెబుతున్నా విషయం తెలిసిందే అన్నారు. టిడిపి పార్టీ పరిస్తితి ఇలా ఉంటే కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ మరీ దారుణంగా ఉంది అన్నారు. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లో బీజేపీ మానిఫెస్టో లో జోన్ ఏర్పాటుచేస్తామని చెప్పిన ఆ విషయం సంగతి గుర్తుచేశారు. గతoలో జోన్ ఏర్పాటు కోసం తాను దీక్ష చేపట్టినప్పుడు ఏడ్డేవ చేసిన సంగతి తెలిసిందే అన్నారు. మొదట నుండి వైఎస్సార్సీపీ జోన్ కోసం పోరాడుతోంది అన్న విషయం తెలిసిందే అన్నారు. ఏ త్యాగాలకైనా తాము సిద్ధపడి జోన్ సాధించేందుకు పోరాటాలు చేస్తామని అన్నారు. ఏటువంటి షరతులు లేకుండా విశాఖ జోన్ సాధించడమే తమ లక్ష్యమన్నారు. టిడిపి,బీజేపీ లకు విశాఖ పై ఏటువంటి ప్రేమ లేదు అన్నారు.
సమావేశం లో కొయ్య ప్రసాద్ రెడ్డి, సత్తి రామకృష్ణ రెడ్డి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరన్, కోలా గురువులు , అక్కరమాని నిర్మల, రవిరేడ్డి, ఫరూఖి, కాంతా రావు, తదితరులంతా పాల్గొన్నారు.