Vizag vision:AP CM Along With Family Members Prayers At Tirumala Temple,Tirupathi…దేవాన్ష్ మంచి పౌరుడిగా ఎదగాలని దేవుడిని కోరుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మనుమడు దేవాన్స్ పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… శ్రీవారు మా కులదైవమని, దేవాన్ష్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు తిరుమలలోనే నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం కావాలని శ్రీవారిని కోరుకున్నానని, స్వామివారి దయతో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నానని చంద్రబాబు. కాగా… స్వామివారి దర్శనం అనంతరం అన్నదానం కాంప్లెక్స్‌లో భక్తులకు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నప్రసాదాలు వడ్డించారు