Andhra Pradesh Cyber Security Operation Centre Inauguration By Honorable AP CM,Amaravathi,Vizagvision…
సచివాలయంలో సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ కన్సల్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న వివిధ కంపెనీల సిఈఓలు
సైబర్ సెక్యూరిటీ పాలసీ రూపకల్పన పై చర్చ
సైబర్ సెక్యూరిటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు ఆకర్షించేందుకు తీసుకురావాల్సిన పాలసీ పై వివిధ కంపెనీల సిఈఓ ల అభిప్రాయాలు తెలుసుకొన్న మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తున్నాం
రియల్ టైం గవర్నెన్స్ అమలు చేస్తున్నాం
10 లక్షల ఐఓటి పరికరాలు వినియోగిస్తున్నాం.రియల్ టైంలో సమాచారాన్ని తెలుసుకుంటున్నాం
టెక్నాలజీ సహాయంతో ప్రజలకు అనేక సర్వీసెస్ అందిస్తున్నాం
తాగునీటి నాణ్యత,ట్యాంకర్ల ద్వారా సరఫరాని కూడా టెక్నాలజీ సహాయంతో తెలుసుకుంటున్నాం
పేపర్ లెస్ గవర్నెన్స్ తీసుకొచ్చే ప్రక్రియలో ఉన్నాం
టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్ది,సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉంది
అందుకే సైబర్ సెక్యూరిటీ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం
రాష్ట్ర ప్రభుత్వ కీలక సమాచారాన్ని కాపాడుకోవడం తో పాటు సైబర్ సెక్యూరిటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకొని పాలసీ రూపొందిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయానికి 99 శాతం
ఐటీ కంపెనీలు తెలంగాణలో ఉండిపోయాయి
రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కి అనేక పాలసీలు తోసుకొచ్చాం
2019 కి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
దేశంలోనే మూడవ క్లీన్ సిటీ గా ఉన్న విశాఖపట్నం ఇప్పుడు ఐటీ హబ్ గా మారుతుంది
విశాఖపట్నం కి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,కాన్డ్యూయెంట్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి
అమరావతి కి హెచ్సిఎల్,పై డేటా సెంటర్లు వచ్చాయి
తిరుపతి కి జోహో వచ్చింది
సైబర్ సెక్యూరిటీ లో నెక్స్ట్ జనరేషన్ వారియర్స్ ను సిద్ధం చెయ్యడానికి కృషి చేస్తున్నాం
ప్రతి నెలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నాం
విద్యార్థులుకు సైబర్ సెక్యూరిటీ లో ఉద్యోగాలు సాధించే విధంగా శిక్షణ ఇవ్వబోతున్నాం
అధునాతన టెక్నాలజీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాం
బ్లాక్ చైన్ టెక్నాలజీ లో లీడర్ గా ఉన్న కన్సెన్సిస్
(consensys)
కంపెనీ భాగస్వామ్యంతో త్వరలోనే శిక్షణ ప్రారంభించబోతున్నాం
ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ను ఈ రోజు ప్రారంభించబోతున్నాం
ఇది మొదటి అడుగు.ఇతర రాష్ట్రాలకు కూడా సైబర్ సెక్యూరిటీ సేవలు అందించబోతున్నాం
ఇండస్ట్రీ అవసరాలు తెలుసుకొని రాయితీలు కల్పించబోతున్నాం
మీ అవసరాలు తెలుసుకొని పాలసీ రూపొందించాలి అనే ఆలోచనతో మీతో సమావేశం అయ్యాను.త్వరలోనే మీరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా సైబర్ సెక్యూరిటీ
పాలసీ రూపొందిస్తాం