గ్రూప్-1 ఫలితాల్లో ఒకటో ర్యాంకు సాధించిన వెంకటరమణను ముఖ్యమంత్రి అభినందించారు. ఉద్యోగంలోనూ మంచి పనితీరు కనబర్చాలని సూచించారు.
ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షల్లో 10కి 10 పాయింట్లు సాధించిన పురపాలక పాఠశాలల విద్యార్థులు కూడా సీఎంను కలిశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో చదివిన 33 మంది విద్యార్థులు పదిపాయింట్లు సాధించారు.
నగర మేయర్ కోనేరు శ్రీధర్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని సీఎంను కలిశారు. ముఖ్యమంత్రి వారిని అభినందించారు.