మPrice of Garlic has fallen in Madhya Pradesh,Vizagvision..మధ్యప్రదేశ్లో వెల్లుల్లి ధర దారుణంగా పడిపోయింది.కిలో కేవలం రూపాయి పలకడంతో రైతులు పంటను పారబోస్తున్నారు.
నీముచ్ కూరగాయల మార్కెట్లో గత జనవరిలో కిలో ధర రూ.50 నుంచి రూ.80 వరకు ఉండగా, ఇప్పుడు రూ.2 నుంచి రూ.5 మధ్యనే ఉంది.
పొరుగున ఉన్న మంద్సువార్ జిల్లా శ్యాంఘర్ మార్కెట్లో అయితే రూ.1కే అమ్ముకోవాల్సి వస్తోంది.
పంట దిగుబడి అధికంగా ఉండడం, వ్యాపారుల వద్ద నగదు లేకపోవడం, వస్తు-సేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దు ప్రభావం చూపుతుండడమే ఇందుకు కారణాలని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి