Home UncategorizedVizag Vision Visakhapatnam :

Vizag Vision Visakhapatnam :

by Deva Trinadh Rao

ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా బీచ్ రోడ్డులో వాటర్ ఫాగింగ్/మిస్ట్ కానన్‌ను ఏర్పాటు చేసిన విశాఖపట్నం పోర్ట్

విశాఖపట్నంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో, విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్ పరిధి మరియు రైల్వే స్టేషన్ రోడ్డులో వాటర్ ఫాగింగ్/మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా నిరంతరం ఆయా ప్రాంతంలో నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్కే బీచ్ నుంచి అప్పుఘర్ ప్రాంతం వరకు, రైల్వే స్టేషన్ రోడ్డు అలాగే ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ఇతర ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. దీని ద్వారా తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.

బీచ్ రోడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు మరియు సందర్శకులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రస్తుత ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపదుతున్నారు.

ఈ మిస్ట్ కానన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరిసర ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుంది, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసినట్లు పోర్ట్ యాజమాన్యం తెలిపింది.


You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.