చంద్రబాబు, నేను కలుస్తున్నాం ఎంపీలకు చెప్పిన ప్రధాని మోడీ.
2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను కలుస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు.
మేమిద్దరం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పెండింగ్ అంశాలు అన్నింటిని చర్చించి ఏపీకి ఎలా న్యాయం చేయాలో చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కి సహాయం చేయటానికి అన్ని వేళలా నేను కృషి చేస్తాను అని మోడీ చెప్పినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు.
అప్పుడే రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయా అని కామెంట్ చేశారట ప్రధాని.పోలవరం విషయంలో అసలు ఇబ్బందులు ఏమీ లేకుండా చేస్తున్నాము అని మోడీ చెప్పారట.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఏపీలో కాక పుట్టిన నేపథ్యంలో గత కొంత కాలంగా పార్లమెంటులో తమ డిమాండ్లను గట్టిగా వినిపిస్తున్న టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి మోడీపై వత్తిడి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసారు.