HomeUncategorizedVizagvision Visakhapatnam:వైద్య విద్యలో వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరస్పాండెంట్ మద్ది హరి కుమార్ కుమార్తె అత్యుత్తమ ప్రతిభ ….ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌లో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత విశాఖపట్నం, నవంబర్ 19వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరెస్పాండెంట్ మద్ది హరి కుమార్, పార్వతి దంపతుల పుత్రిక మద్ది వెంకట సాయి అర్చన వైద్య విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో పాటు 676 మార్కులు సాధించారు.చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఎల్‌కేజీ నుంచి ఇప్పటివరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్న అర్చన.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనూ 714 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కష్టపడి పనిచేసే తత్వానికి భగవంతుడి ఆశీస్సులు తోడవడంతోనే ఈ అద్భుత విజయాలు సాధ్యమవుతున్నాయని ఆమె నిరూపిస్తున్నారు.భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకుని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ఆమె దృఢ సంకల్పం. భగవంతుని అశిస్సులతో అర్చన మరెన్నో విజయాలు సాధించి, మరింత ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
Vizagvision Visakhapatnam:వైద్య విద్యలో వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరస్పాండెంట్ మద్ది హరి కుమార్ కుమార్తె అత్యుత్తమ ప్రతిభ ….ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌లో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత విశాఖపట్నం, నవంబర్ 19వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరెస్పాండెంట్ మద్ది హరి కుమార్, పార్వతి దంపతుల పుత్రిక మద్ది వెంకట సాయి అర్చన వైద్య విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో పాటు 676 మార్కులు సాధించారు.చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఎల్‌కేజీ నుంచి ఇప్పటివరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్న అర్చన.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనూ 714 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కష్టపడి పనిచేసే తత్వానికి భగవంతుడి ఆశీస్సులు తోడవడంతోనే ఈ అద్భుత విజయాలు సాధ్యమవుతున్నాయని ఆమె నిరూపిస్తున్నారు.భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకుని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ఆమె దృఢ సంకల్పం. భగవంతుని అశిస్సులతో అర్చన మరెన్నో విజయాలు సాధించి, మరింత ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.