Vizag Vision Visakhapatnam:శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వామి స్థాపించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ), కాంచీపురం లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్‌మెంట్, లా మహిళలు అలైడ్ హెల్త్ సైన్సెస్, సంస్కృతం, బిఎడ్ ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు.గత 33 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ విద్యాలయంలో ప్రవేశాలకోసం జూన్ 6 శనివారం విశాఖపట్నం, ద్వారకానగర్, శ్రీ కంచి కామకోటి శంకర మఠంలో, సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు స్పాట్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జీ శ్రీనివాసు,డీన్ ఆచార్య కే . వెంకట రమణ, పాల్గొని విశ్వవిద్యాలయం, కోర్సులో ప్రవేశ విధానం, ఉపాధి అవకాశాల గురించి వివరాలను తెలియజేస్తారని ప్రకటనలో తెలిపారు.ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్‌షిప్ పద్ధతిలో ప్రవేశాలు లభిస్తాయని విద్యార్థులకు శాకాహార భోజనం, జిమ్, ఆధునిక క్రీడా మైదానాలు, ఉత్తమ వసతి సౌకర్యాలు, ఆకర్షణీయమైన ప్లేస్‌మెంట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కంచి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులలో 70 శాతానికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే విద్యనభ్యసిస్తున్నారని అర్హతకలిగి ఆసక్తి కలిగిన విద్యార్థులకు తక్షణ స్పాట్ అడ్మిషన్లు లభిస్తాయని ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు,కంచియూనివ.ఏసీ.ఇన్ వెబ్ సైట్ లో లేదా యూనివర్సిటీ కార్యాలయం ఫోన్ నెంబర్ 9629001144, ఆయుర్వేద కోర్సుల వివరాలకు 8098001630, స్థానిక సంప్రదింపులకోసం 98480 90255 నెంబర్ లను సంప్రదించాలని కోరారు.విశాఖపట్నం పరిసర ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.