Vizag Vision Visakhapatnam: శంకర్ ఫౌండేషన్ కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన రెండవ రోజు 613 మందికి కంటి పరీక్షలుఅగనంపూడి : ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా శంకర్ ఫౌండేషన్ సహకారంతో అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో రెండు రోజుల సమగ్ర ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ శ్రీ రవి చంద్ర కట్టా , మరియు ఇతర అధికారులు ఈ కంటి వైద్య శిబిరానికి లభించిన స్పందన చూసి ఆనందాన్ని వ్యక్త పరిచారు.ఈ రోజు విశేషాలు : * 613 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు . (మొత్తము 1113 )* 501 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు సూచించగా , 425 మందికి ఈ శిబిరంలో స్పాట్లో కళ్లద్దాలు తయారు చేసి పంపిణీ చేశారు. (మొత్తము 770 )* 30 సెప్టెంబర్ లో 17 మందికి శస్త్రచికిత్సలు అవసరమని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్లి , ఈ రోజు (1 అక్టోబర్) వీరికి విజయవంతముగా , కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడము జరిగినది.*ఈ రోజు 58 మందికి శస్త్రచికిత్సలు అవసరమని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించి రేపు వీరికి శస్త్రచికిత్సలు నిర్వహించబడునని శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు తెలిపారు.* ఈ రెండు రోజుల్లో 440 మందికి ఉచితముగా మందులు పంపిణి చేసారు .ఫోటో క్యాప్షన్: ఈ రోజు విజయవంతముగా ఉచితముగా కంటి శస్త్రచికిత్సలు చేయించుకొన్న లబ్ది దారులుకె. బంగార్రాజుడిప్యూటీ జనరల్ మేనేజర్ – PR, Liaison & Corporate Affairsశంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్📞 98481 89378