Vizagvision Bogapuram:

ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం

  • కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం
  • ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను
  • దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
  • మూడవసారి ప్రధానిగా శ్రీ మోదీ గారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు
  • శ్రీ మోదీ గారికి వెనుక బలంగా నిలబడదాం
  • భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి కోసం నేను ఎందుకు తపనపడ్డానంటే దేశ అభివృద్ధికి బలమైన నాయకత్వం అవసరం. ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ పోర్ట్ కడతారంట అంటూ అభివృద్ధిని అపహాస్యం చేసి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాయకులకు గట్టిగా సమాధానం చెప్పాలనే కూటమిలో కచ్చితంగా మూడు పార్టీలు ఉండాలని తపనపడ్డాను. 2024 తర్వాత రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, పలు పరిశ్రమలు రావడానికి ఇది ఓ దారి చూపింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి కారణం అయ్యింది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
జాతి ఎవరికీ తల వంచదు.. ఈ గుండె దేనికి భయపడదు అని చాటి చెప్పిన మన్యం వీరుడు, మహనీయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు. భోగాపురంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ప్రసంగించారు. శనివారం ఉదయం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది నూతన అధ్యాయం. ఈ రోజు రూ. 17,435 కోట్ల అభివృద్ధి పనులు శ్రీ మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ పనులు వల్ల రోడ్ల అనుసంధానం మరింత పెరిగుతుంది. ఎనర్జీ సెక్టార్లలో పరిశ్రమలకు అనువైన ఇంధన సరఫరా జరిగి యువతకు మరింతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఒక దేశం ఎప్పుడూ ప్రకటనలతో అభివృద్ధి చెందదు. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను మరింత విస్తృతం చేయడం ద్వారా దేశం ప్రగతి ప్రయాణంలో ముందుకు సాగుతుంది.
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్, ఆత్మ నిర్భర భారత్ ప్రణాళికల్లో భారత్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే గొప్ప దార్శనికత ఉంది. కచ్చితంగా చరిత్ర మనం నిర్మించే కట్టడాలను కాదు ఆ కట్టడాలతో నిర్మించే భవిష్యత్ ను గుర్తు ఉంచుకుంటుంది.
అభివృద్ధి బాటలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారు. ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రూ. 50 వేల కోట్లతో అమరావతి పనులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయి. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా ప్రజల ఆకాంక్షలు తీరనున్నాయి.
దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వారిని గౌరవించాలి
పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు.. రాజకీయాల్లోకి వచ్చాక నన్ను కూడా చాలామంది అనరాని మాటలు అన్నారు. ఎన్నో నిందలు పడ్డాను. అయితే భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఇష్టానుసారం కొందరు తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. భారతదేశం ఒకప్పుడు.. ఖజానా దగ్గర ఉన్న బంగారాన్ని విదేశాలకు తరలించి తాకట్టు పెట్టి, రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించే దుస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా మన దేశం రూపొందడంలో మూడోసారి ప్రధానిగా తన బాధ్యతలను ఎంతో నిబద్దతగా నిర్వర్తిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారిని అనరాని మాటలు అనడం బాధించింది. కన్నీళ్లు వచ్చాయి, బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థం గా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది?
ఒక్క రోజు సెలవు తీసుకోని ప్రధాని
పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి శ్రీ మోదీ గారు. కొత్త తరం మోదీ గారు పడిన తపన, శ్రమ తెలుసుకోవాలి. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు బలంగా వస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో మన దగ్గర ఉన్నాయి. శత్రు దేశాలు మన అభివృద్ధిని చూసి ఈర్ష పడుతున్నాయి. ఒక పక్క దేశాన్ని ముందుకు నడిపిస్తూ, సరిహద్దుల వద్ద శత్రుదేశాలతో పోరాడాలి. అంతర్గత శత్రువులతోనూ పోరాటం చేయాలి. అలాంటి వ్యక్తికి మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే- మేమంతా మీ వెనుక ఉన్నాం.. దేశం కోసం మీతో కలిసి నడుస్తాం అనే భరోసాను గౌరవ ప్రధానికి మనం కల్పించాలి. మీ మీద మాట పడితే యావత్ భారతదేశం మీద మాట పడినట్లే అనే బలం ఇవ్వాలి. నేను సభా వేదిక సాక్షిగా చెబుతున్న… భారతదేశంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి సాటిగల నాయకుడు మరొకరు లేరు. రారు రాబోరు. 144 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఆశలను బలంగా ముందుకు తీసుకు వెళ్తుంటే, ఎన్నో సవాళ్ళను ఆయన చిరు మందహాసంతోనే స్వీకరిస్తున్నారు.. వాటిని పరిష్కరిస్తున్నారు.
యువత దేశానికీ వనరు
25 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే. పిల్లలకు సరైన సంస్కారం, సంప్రదాయం నేర్పడం మన బాధ్యత. వారిని దేశానికి ఉపయోగపడే గొప్ప వనరులుగా మార్చాల్సిన ప్రాథమిక బాధ్యత మనపైనే ఉంది. ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వీడియో చూశాను. ఆయనను ఇష్టానుసారం తిట్టిన, తూలనాడిన యువతను సైతం పెద్ద మనసుతో ఆయన క్షమించడం గొప్ప విషయం. ఆయన స్వచ్ఛమైన మనసుకు వందనం. దేశాన్ని ముందుకు నడిపించడం అంటే రామకార్యం. హనుమంతుడు రామకార్యం నిమిత్తం లంకకు లంఘించినప్పుడు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. అలాంటిది 144 కోట్ల మంది భారతీయులను ముందుకు నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. అది మహాకార్యం. అలాంటి మోదీ గారికి మనం ఎం ఇవ్వగలం..? ఆయనకు బలమైన మన విధేయత ఇవ్వాలి. ఆయన వద్దు అనుకున్న రోజు అధికారం పోవాలి తప్ప, అప్పటివరకు మోదీ గారే దేశాన్ని ముందుండి నడిపించాలని కోరుకొంటున్నాను” అన్నారు.

Related posts

Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద ⁠శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై ⁠శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. ⁠చందమామను- యోగి నారేయణతరువాత ⁠రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.

Vizagvision:వెస్ట్రన్ DFCపై తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలుమార్గం: JNPT ముంబై నుంచి వడోదర వరకు – 422 కి.మీ.లోడ్: 360 TEUsరైలు నిర్మాణం: రెండు రేక్‌లను కలిపి నడిపించారుకంటైనర్లు: ఒక్కో రేక్‌లో 45+1 కంటైనర్లుమొత్తం బరువు: 3,922 టన్నులుJNPT ముంబై నుంచి తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును నడిపిన భారతీయ రైల్వేవడోదర డివిజన్‌లోని వర్నామా CONCOR GCT టెర్మినల్‌కు 422 కి.మీ. దూరం వరకు 360 TEUs కంటైనర్ల రవాణాభారతీయ రైల్వే 21.08.2026న ఒక కీలకమైన ఆపరేషనల్ మైలురాయిని సాధించింది. JNPT ముంబై నుంచి వడోదర డివిజన్‌లోని వర్నామా వద్ద ఉన్న CONCOR GCT టెర్మినల్‌కు 360 TEUs కంటైనర్లతో కూడిన తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.ఈ లాంగ్-హాల్ రైలు సుమారు 422 కి.మీ. దూరాన్ని ప్రయాణించింది. ఈ రైలు 21.08.2026న 19:00 గంటలకు JNPT నుంచి బయలుదేరింది.ఈ లాంగ్-హాల్ రైలు రెండు డబుల్-స్టాక్ రేక్‌లతో రూపొందించబడింది:ముందువరుస రేక్: JNPT–వడోదర | లోడ్: 45+1 కంటైనర్లు | లోకో నం.: 60311 | బరువు: 1,817 టన్నులువెనుక వరుస రేక్: JNPT–వడోదర | లోడ్: 45+1 కంటైనర్లు | లోకో నం.: 24690 | బరువు: 2,105 టన్నులుఈ రెండు రేక్‌లు కలిపి మొత్తం 360 TEUs కంటైనర్లను రవాణా చేశాయి. ఒకే లాంగ్-హాల్ రైలు ద్వారా భారీ పరిమాణంలో కంటైనరైజ్డ్ సరుకులను సమర్థవంతంగా రవాణా చేయగల భారతీయ రైల్వే సామర్థ్యాన్ని ఇది చాటిచెప్పింది.డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైళ్ల ప్రయోజనాలుటెర్మినల్ రద్దీ తగ్గింపు:ఒకే రైలులో ఎక్కువ సంఖ్యలో కంటైనర్లను రవాణా చేయడం ద్వారా పోర్టులు, టెర్మినల్స్‌లో కంటైనర్లు నిలిచే సమయం తగ్గుతుంది. తద్వారా టెర్మినల్స్‌లో రద్దీ తగ్గడంతో పాటు కంటైనర్లను వేగంగా తరలించేందుకు వీలవుతుంది.రోలింగ్ స్టాక్ అవసరం తగ్గింపు:డబుల్-స్టాక్ విధానంలో ఒకే రైలు ద్వారా ఎక్కువ కంటైనర్లను రవాణా చేయవచ్చు. దీంతో సమాన పరిమాణంలో సరుకును రవాణా చేయడానికి అవసరమైన లోకోమోటివ్‌లు, కంటైనర్ ఫ్లాట్ వ్యాగన్‌ల సంఖ్యను తగ్గించవచ్చు.రూట్ సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించడం:ఒకే రైలులో ఎక్కువ కంటైనర్లను రవాణా చేయడం ద్వారా అదే పరిమాణంలో సరుకును తరలించేందుకు అవసరమైన రైళ్ల రాకపోకల సంఖ్య తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న రైలు మార్గ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.రవాణా సమయం తగ్గింపు:లాంగ్-హాల్ కంటైనర్ రైళ్ల ద్వారా కంటైనర్లను వేగంగా తరలించి గమ్యస్థానాలకు చేరవేయవచ్చు. తద్వారా సరుకు రవాణాకు పట్టే మొత్తం సమయం తగ్గుతుంది.అధిక సరుకు రవాణా సామర్థ్యం:ఒకే రైలు ప్రయాణంలో అధిక సంఖ్యలో కంటైనర్లను రవాణా చేయడం ద్వారా JNPTతో పాటు ఇతర సరుకు రవాణా టెర్మినల్స్ నుంచి కంటైనర్లను వేగంగా తరలించవచ్చు. అదే సమయంలో మొత్తం రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.హరిత, సుస్థిర సరుకు రవాణాకు ప్రోత్సాహంఈ రైలు నిర్వహణ భారతీయ రైల్వేలు హరిత, సుస్థిర సరుకు రవాణాకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విద్యుత్‌తో నడిచే ఈ రైలు ద్వారా డీజిల్ ఆధారిత రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు.ఒక డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు, రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడానికి పెద్ద సంఖ్యలో ట్రక్కులు అవసరమయ్యేంత సరుకును ఒకేసారి తరలించగలదు. దీనివల్ల డీజిల్ వినియోగం, రహదారులపై రద్దీ, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, అలాగే సరుకు రవాణా ద్వారా ఏర్పడే మొత్తం కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గుతాయి.

Vizagvision: