Vizagvision New Delhi:INDIAN NAVY’S EASTERN FLEET SHIPS UDAYGIRI, KAVARATTI, AND SHAKTI ARRIVE AT SATTAHIP, THAILAND Indian Naval Ships Udaygiri, Kavaratti, and Shakti of the Eastern Fleet arrived at Sattahip, Thailand, as part of their operational deployment to the South East Asia Region. The ships, led by RAdm Alok Ananda, Flag Officer Commanding Eastern Fleet, were received by the Royal Thai Navy. The port call is part of India’s continued maritime engagement with South East Asian nations and reflects the close and long-standing maritime partnership between India and Thailand. The visit will include professional exchanges, cross-deck visits, operational interactions, sporting engagements, and community outreach aimed at strengthening navy-to-navy cooperation and interoperability. The port call aims to further strengthen camaraderie, mutual cooperation, and bilateral maritime ties between India and Thailand. It also showcases the indigenous design, modular construction, and state-of-the-art technology of Indian Naval ships, highlighting India’s growing capabilities, and credentials as a reliable partner, in defence technology.

Related posts

Vizagvision Visakhapatnam :🚢 సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరుకు నిర్వహణలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించింది. అక్టోబర్ 13, 2026 నాటికి మొత్తం 50,007,081 టన్నుల కార్గోను నిర్వహించి ఈ ఘనతని సాధించింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు (అక్టోబర్ 30, 2025), 2024–25లో 224 రోజులు (నవంబర్ 10, 2024) సమయం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రికార్డుతో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు రికార్డుతో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించింది.*కీలక మైలురాళ్లు – విజయాలు*❖ 13 అక్టోబర్ 2026: 196 రోజుల్లో 50 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని అధిగమించింది.❖ 7 అక్టోబర్ 2026: 180 రోజుల్లో 45 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 సెప్టెంబర్ 2026: 156 రోజుల్లో 40 ఎంఎంటీ కార్గోను నిర్వహించింది.❖ 1 సెప్టెంబర్ 2026 – ఎస్‌పీఎం: బెల్జియం జెండాతో ప్రయాణిస్తున్న ATREBATES నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక ఎస్‌పీఎం బెర్త్ వద్ద బెర్తింగ్ పొందిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా నిలిచింది.❖ 15 ఆగస్టు 2026: 137 రోజుల్లో 35 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 11 ఆగస్టు 2026 – ఈక్యూ-1ఏ: M.V. KONA EXPLORER నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని బల్క్ రూపంలో అన్‌లోడ్ చేసింది.❖ 23 జూలై 2026: 114 రోజుల్లో 30 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 జూలై 2026 – 94 రోజుల్లో 25 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని చేరుకుంది.❖ జూన్ 2026 – ఒక క్యాలెండర్ నెలలో అత్యధికంగా 2,158,712 టన్నుల ముడి చమురును అన్‌లోడ్ చేసి రికార్డు సృష్టించింది.❖ 14 జూన్ 2026: 76 రోజుల్లో 20 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 5 జూన్ 2026 – ఈక్యూ-1: M.V. GRACEAUS నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ పరిమాణంలోని నౌక ఈక్యూ-1 వద్ద బెర్తింగ్ పొందడం ఇదే తొలిసారి.❖ 1 జూన్ 2026 – ఈక్యూ-1ఏ: M.V. GUO HAI LIAN 818 నౌక నుంచి 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని అన్‌లోడ్ చేసింది.❖ మే 2026 – నెలలో అత్యధికంగా 1,858,169 టన్నుల ముడి చమురును అన్‌లోడ్ చేసింది.❖ 11 మే 2026: 41 రోజుల్లో 10 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 25 ఏప్రిల్ 2026 – ఈక్యూ-1: M.V. REGINA OLDENDORFF నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకకు బెర్తింగ్ కల్పించడం ద్వారా మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.పోర్ట్ ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని చైర్‌పర్సన్ శ్రీ జె.ఎస్. బింద్రా, ఐఆర్‌టీఎస్, డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి, ఐఏఎస్, అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.

Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.

Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు.