Vizagvision Visakhapatnam:చూపు మసకబారిన జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్న శంకర్ ఫౌండేషన్ సేవలుకళ్లకు చికిత్స…. ఇళ్లకు వెలుగు… • ఆసుపత్రి వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకరరావు జయంతి.శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి పేరు వినగానే కంటి రోగులు నిద్రలోనూ పరుగులు పెడుతుంటారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన కంటి రోగుల్లో కొత్త వెలుగులు నింపుతూ నవ జీవనం వైపు వారిని నడిపిస్తోంది. చేతి కర్ర, కళ్లద్దాలను పక్కన పెడుతూ విప్పారిన నెత్రాలతో వడివడిగా అడుగులు వేయిస్తోంది… గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ ప్రాంతాల ప్రజలకు శంకర్ ఫౌండేషన్ నేత్ర దానం చేస్తూ వారిలో నూతనత్వపు బీజాలు నాటి విశేషమైన సేవలు అందిస్తోంది. కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనంతో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 95వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు. వ్యాపారవేత్త శంకరరావు ఉన్నత ఆశయంతో కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంధత్వాన్ని తొలగించడం మరియు పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని 1997లో సామాజిక బాధ్యతగా లోతైన భావనతో శంకరరావు, తన భార్య ఆత్మకూరి యశోద మరియు స్వర్గీయ కె. పార్వతీకుమార్, డి.వి. సుబ్బారావు సహకారంతో సింహాచలం ప్రాంతంలోని ఒక నిరాడంబరమైన రెండు పడకగదుల ఫ్లాట్లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. కేవలం ఇద్దరు వైద్యులు మరియు 15 మంది ఉద్యోగులతో ఉచిత అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు. ఇంత ఘనత మరియు పేరు ప్రఖ్యాతలు సాధించడానికి ఎంత గానో కృషి చేస్తున్న డాక్టర్ల కు , ఉద్యోగులకు , జిల్లా యంత్రాంగానికి , రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ ఆత్మకూరు కృష్ణ కుమార్ , మేనేజింగ్ ట్రస్టీ మరియు సిఇఓ కృతజ్ఞతులు తెలియచేసారు లియచేసారు.తరువాత అంచలంచెలుగా 2002 లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ రూ.20 , 2008 లో రూ.100 మరియు 2015 నుండి రూ.250 కు ప్రస్తుతం రూ 300 పెంచడము జరిగింది . గత 29 సంవత్సరాలుగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్ర రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వేనోళ్ల కొనియాడబడుతోంది. నేత్రం నయనం ప్రధానం అన్నట్లు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని నాయుడుతోటలో రెండెకరాల విశాలమైన స్థలంలో 200 పడకలతో ఐదు అంతస్తులలో అత్యాధునిక సౌకర్యాలు, ఎనిమిది ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మరియు అన్ని సబ్-స్పెషాలిటీలతో దిగ్విజయంగా నడుస్తోంది. 450 మందికి పైగా సిబ్బంది,సూపర్ స్పెషలిటీ వైద్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రికి గట్టి భద్రతను ఏర్పాటు చేసారు.ఆసుపత్రిలో రోజుకు సగటున 120నుండి 150వరకూ కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. జూన్ 17 న అత్యధికంగా 201 కంటి శస్త్రచికిత్సలు చేసి ఒక రికార్డు ను నెలకొల్పింది ప్రతిరోజూ 400 నుండి 500 మంది రోగులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, నిబద్ధతను మరింత పెంచుకుంటూ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది, ఇది కంటి సంరక్షణ సేవలలో ఆచరణాత్మక నైపుణ్యంతో ఔత్సాహిక నిపుణులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన ఉద్యోగ-ఆధారిత వృత్తి కోర్సులను అందిస్తోంది . ఆసుపత్రి నిర్వహణకు ప్రముఖ న్యాయవాది ఎం రాందాస్ నేతృత్వంలోని ట్రస్టీల బోర్డు మార్గనిర్దేశం చేస్తోంది. మేనేజింగ్ ట్రస్టీ మరియు CEO ఆసుపత్రి వ్యవస్థాపకులు శంకరరావు పెద్ద కుమారుడు ఆత్మకూరి కృష్ణ కుమార్ ఆసుపత్రిని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ట్రస్టీలు ప్రొఫెసర్ ఎ. ప్రసన్నకుమార్ మరియు ఎ. విజయకుమార్ ల సమిష్టి కృషి ఫలితంగా ఆసుపత్రిని కొత్త శిఖరాలకు చేర్చేందుకు దోహద పడింది. శంకర్ ఫౌండేషన్ దినదిన ప్రవర్దమానం చెండడానికి స్వర్గీయ కె. పార్వతీకుమార్,డి.వి. సుబ్బారావు, ఎ. శంకరరావు మరియు శంకరరావు భార్య ఆత్మకూరి యశోద, కె.బి.ఎన్. మణిమాలల సహకారం ఎంతో తోడ్పాటునిచ్చింది. వారి నాయకత్వం మరియు ప్రచారం ఆసుపత్రి పరిధిని మరియు ఖ్యాతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. మణిమాల ముఖ్యమైన పాత్ర పోషించి ఆసుపత్రి స్థాయిని గణనీయంగా పెంచారు. దివంగత ఆత్మకూరి శంకరరావు శంకర్ ఫౌండేషన్ను కారుణ్య కంటి సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తయారు చేసారు.శక్తివంతమైన నిపుణులను తయారు చేయడానికి వైద్య మరియు నైపుణ్య-ఆధారిత కోర్సులను అందించే ఒక ప్రసిద్ధ విద్యా సంస్థగా కూడా తీర్చి దిద్దారు. 2011లో, ఫౌండేషన్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారిక శిక్షణా సంస్థగా గుర్తించడంతో శంకరరావు కల సాకారం అయింది. భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ తో సమానమైన హోదాను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఇచ్చింది..శంకర్ ఫౌండేషన్ డీఎన్బీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్గా కూడా గుర్తింపు పొందింది.ఈ సంస్థ 30 మందికి పైగా నేషనల్ బోర్డ్ డిప్లొమేట్లకు శిక్షణ ఇచ్చింది, వారు ఇప్పుడు దేశంలోని వివిధ వైద్య సంస్థలు, ఆసుపత్రులలో పనిచేస్తున్నారు, శంకర్ ఫౌండేషన్ ఉద్యోగ,ఆధారిత వృత్తిపరమైన కోర్సులను అందించే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు. శ్రీకాకుళం, మధురవాడ, మద్దిలపాలెం మరియు గాజువాకలలో శాఖల ఏర్పాటుతో శంకర్ ఫౌండేషన్ ఈ ప్రాంతంలో ప్రముఖ నేత్ర సంరక్షణ ప్రదాతగా మారింది. ఇది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంప్యానెల్ చేయబడింది మరియు ఈ.హెచ్. ఎస్,టీపీఐ, ప్రధాన కార్పొరేట్ సంస్థ లు మరియు రక్షణ సంస్థల ద్వారా నగదు రహిత సేవలను అందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభం నుండి ఇంతవరకు 5.26 లక్షలకు పైగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించింది. 30.45 లక్షల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన ద్వారా మూడుసార్లు ఉత్తమ ఎన్జీఓ ఆసుపత్రిగా అవార్డులు పొందింది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి అన్నీ రంగాల్లో విస్తరించిన నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న దృష్ట్యా దివంగత ఆత్మకూరి శంకరరావు దార్శనికత, నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. సమాజానికి నిస్వార్ధమైన సేవలు చేయాలన్న సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నేత్ర రోగులు నూతన భవిష్యత్తు వైపు వేసే ప్రతి అడుగులోనూ శంకరరావు కలలు సాకారం కావడంతో ఆయన వరాలిచ్చే మరో శంకరుడే అయ్యారు. ఫోటో శీర్షిక : కీర్తిశేషులు శ్రీ ఆత్మకూరి శంకరరావు గారు మరియు శ్రీమతి ఎ. యశోద గారి సమక్షంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సద్గురు శివానందమూర్తి 2వ జూన్ 1997, విశాఖపట్నం.

Related posts

Vizagvision Visakhapatnam :🚢 సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరుకు నిర్వహణలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించింది. అక్టోబర్ 13, 2026 నాటికి మొత్తం 50,007,081 టన్నుల కార్గోను నిర్వహించి ఈ ఘనతని సాధించింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు (అక్టోబర్ 30, 2025), 2024–25లో 224 రోజులు (నవంబర్ 10, 2024) సమయం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రికార్డుతో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు రికార్డుతో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించింది.*కీలక మైలురాళ్లు – విజయాలు*❖ 13 అక్టోబర్ 2026: 196 రోజుల్లో 50 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని అధిగమించింది.❖ 7 అక్టోబర్ 2026: 180 రోజుల్లో 45 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 సెప్టెంబర్ 2026: 156 రోజుల్లో 40 ఎంఎంటీ కార్గోను నిర్వహించింది.❖ 1 సెప్టెంబర్ 2026 – ఎస్‌పీఎం: బెల్జియం జెండాతో ప్రయాణిస్తున్న ATREBATES నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక ఎస్‌పీఎం బెర్త్ వద్ద బెర్తింగ్ పొందిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా నిలిచింది.❖ 15 ఆగస్టు 2026: 137 రోజుల్లో 35 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 11 ఆగస్టు 2026 – ఈక్యూ-1ఏ: M.V. KONA EXPLORER నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని బల్క్ రూపంలో అన్‌లోడ్ చేసింది.❖ 23 జూలై 2026: 114 రోజుల్లో 30 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 జూలై 2026 – 94 రోజుల్లో 25 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని చేరుకుంది.❖ జూన్ 2026 – ఒక క్యాలెండర్ నెలలో అత్యధికంగా 2,158,712 టన్నుల ముడి చమురును అన్‌లోడ్ చేసి రికార్డు సృష్టించింది.❖ 14 జూన్ 2026: 76 రోజుల్లో 20 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 5 జూన్ 2026 – ఈక్యూ-1: M.V. GRACEAUS నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ పరిమాణంలోని నౌక ఈక్యూ-1 వద్ద బెర్తింగ్ పొందడం ఇదే తొలిసారి.❖ 1 జూన్ 2026 – ఈక్యూ-1ఏ: M.V. GUO HAI LIAN 818 నౌక నుంచి 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని అన్‌లోడ్ చేసింది.❖ మే 2026 – నెలలో అత్యధికంగా 1,858,169 టన్నుల ముడి చమురును అన్‌లోడ్ చేసింది.❖ 11 మే 2026: 41 రోజుల్లో 10 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 25 ఏప్రిల్ 2026 – ఈక్యూ-1: M.V. REGINA OLDENDORFF నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకకు బెర్తింగ్ కల్పించడం ద్వారా మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.పోర్ట్ ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని చైర్‌పర్సన్ శ్రీ జె.ఎస్. బింద్రా, ఐఆర్‌టీఎస్, డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి, ఐఏఎస్, అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.

Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.

Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు.