Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.

Related posts

*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి* రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.

Vizagvision:INS SAHYADRI ARRIVES AT BUSAN, REPUBLIC OF KOREA, FOR INDIA-RoKN BILATERAL EXERCISEIndian Naval Ship Sahyadri, an indigenously designed and built guidedmissile stealth frigate of the Indian Navy, arrived at Busan Naval Harbour,Republic of Korea, on 26 Oct 2026 to participate in the India-Republic of KoreaNavy (IN-RoKN) Bilateral Exercise. The visit marks another step towardsstrengthening maritime cooperation and enhancing interoperability between the two navies in the Indo-Pacific.INS Sahyadri was accorded a warm welcome by the Republic of Korea Navy (RoKN), reflecting the growing engagement and enduring strategic partnership between India and the Republic of Korea.During the harbour phase, personnel of both navies will participate in professional interactions, cross-deck visits, cross-training activities and sporting events. These activities will facilitate the exchange of operational experiences and Best Practices, while fostering mutual understanding and professional camaraderie. The Commanding Officer of INS Sahyadri will also call on seniorRoKN officials. The harbour phase will be followed by coordinated maritime activities at sea involving INS Sahyadri and ROKS Munmu the Great,providing opportunities to strengthen operational coordination, enhance interoperability and consolidate professional ties between the two navies.The exercise underscores the shared commitment of India and the Republic of Korea to strengthening maritime cooperation and contributing to peace, stability and security in the Indo-Pacific. It also reflects the Indian Navy’s continued efforts to build enduring partnerships with friendly foreign navies through professional engagement and operational cooperation.

Vizagvision : Pragathi Ratna Award Winner – Mrs. Malla Sarvani – Presented by Shriya Saran”MRS. MALLA SARVANI HONOURED WITH PRESTIGIOUS PRAGATHI RATNA AWARD IN HYDERABADVisakhapatnam: In a moment of great pride, Mrs. Malla Sarvani has been conferred with the prestigious PRAGATHI RATNA AWARD at a grand ceremony held yesterday in Hyderabad.The award was presented by renowned film actress Mrs. Shriya Saran at a prestigious event organised by eminent Business Coach Mr. Venu Kalyan.This award recognizes individuals for their outstanding contribution, leadership and excellence in their respective fields.This remarkable recognition is a proud milestone not only for her family but also for the entire team of School of Wonder Kids, Visakhapatnam. Her achievement is a reflection of her unwavering dedication, commitment and passion for excellence in the field of early childhood education.The management, staff, students and parents of School of Wonder Kids, Visakhapatnam, have extended their heartiest congratulations to Mrs. Malla Sarvani and wished her many more successes in the future.